Breaking : గౌతమ్ మోడల్ స్కూల్లో లిఫ్ట్ ప్రమాదం

ఏడుగురు టీచర్లకు గాయాలు

On
Breaking : గౌతమ్ మోడల్ స్కూల్లో లిఫ్ట్ ప్రమాదం

నిజాంపేట్ గౌతమ్ మోడల్ స్కూల్లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు టీచర్లు శ్రావణి, రజిత, దీపిక, ప్రతిషా, రజిని, నాగశ్రీ, లక్ష్మీదుర్గలకు గాయాలయ్యాయి. ఘటన మధ్యాహ్నం పాఠశాల వదిలే సమాయంలో అయ్యింది. వెంటనే స్పందించిన పాఠశాల మ్యానేజ్మెంట్ ప్రగతి నగర్ లోని పీపుల్స్ ఆసుపత్రికి తరలించారు. వీరికి బోన్ ఫ్రాక్చర్ జరిగిందని డాక్టర్లు నిర్దారించారు. 

మొదటి అంతస్తు నుండి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ పై పడడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా జరిగిందని, అదే మూడు నాలుగు అంతస్తుల నుండి లిఫ్ట్ జారీ ఉండి ఉంటే ప్రాణాలు పోయేవని నిపుణులు సూచించారు. అలాగే టీచర్ల స్థానంలో విద్యార్థులు ఉండి ఉంటే ఘోరం జరిగేదని స్థానికులు తెలిపారు.వివిధ స్కూల్ మ్యానేజ్మెంట్లు సైతం లిఫ్టులు ఫిట్నెస్ చెక్ చేసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.

IMG-20251031-WA0051

 

Publisher

Namasthe Bharat

Share On Social Media

Latest News

Advertise