ఎల్లమ్మబండ..అక్రమ నిర్మాణాలకు అడ్డా.!

జీరో పర్మిషనుతో భారీ నిర్మాణాలు

  • 70-80 గజల్లో వెలుస్తున్న 6 అంతుస్తుల భవనాలు 
  • జిహెచ్ఎంసి చట్టం 1955  ఇక్కడ వర్తించదా అంటూ స్థానికులు ఫైర్ 
  • పరోక్షంగా నిర్మాణాలకు సహకారం అందిస్తున్న అధికారులు
  • అక్రమ భవనాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు  


ఎల్లమ్మబండ ప్రాంతంలో జిహెచ్ఎంసి చట్టం 1955 వర్తించదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు మున్సిపల్ అధికారులు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేలా ఉంది కూకట్పల్లి సర్కిల్ 24 టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల వ్యవహార శైలిని చూస్తుంటే. కండ్ల ముందు అక్రమ నిర్మాణమని తెలిసినా… ఏం చేయలేని.. చేతగాని స్థితిలో ఉంటున్నారు. అక్రమ నిర్మాణాన్ని ఆపాలని ఎవరైనా ఫిర్యాదు చేసిన, ఇటు మున్సిపల్‌ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. కంటి తుడుపు చర్యగా నోటీసు ఇస్తూ ఆ తర్వాత నిర్మాణానికి పరోక్షంగా సహకరిస్తున్నారు. ఫలితంగా పిల్లర్‌తో మొదలై.. జీ+6 అంతస్తు వరకు వచ్చినా.. టౌన్‌ ప్లానింగ్‌ విభాగం కండ్లు మూసుకుంటున్నది. కూకట్పల్లి జోనల్‌ కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే..

WhatsApp Image 2025-09-08 at 2.21.03 PM

కూకట్పల్లి 0సర్కిల్‌ 24 ఆల్విన్ కాలనీ డివిజన్‌ ఎల్లమ్మబండలోని నాగార్జున స్కూల్ ఎదురుగ ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా దాదాపు 80 గజాల స్థలంలో రెండు అక్రమ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్త చర్యలు తీసుకోకుండా.. రోడ్డుపైకి  3 ఫీట్ల స్లాబును విస్తరించి జీ+6 నిర్మిస్తున్నా.. అటువైపు కన్నెత్తి చూడలేని దుస్థితిలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఉంది. 

WhatsApp Image 2025-09-08 at 2.21.03 PM (1)

ఈ విషయం స్థానిక టౌన్ ప్లానింగ్ విభాగానికి తెలిసిన, ఒకవేళ ఎవరైనా జోనల్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా.. లాభం లేకుండాపోతుందని, స్లాం అంటూ వెనుకేసుకొని వస్తారని ఆరోపణలు ఉన్నాయి. కంటి తుడుపు చర్యగా నోటీసులు జారీ చేస్తారు తప్ప  అక్రమ నిర్మాణాన్ని కూల్చకపోవడంపై అనేక విమర్శలు చేస్తున్నారు ఎల్లమ్మబండ వాసులు. ఇప్పటికైనా అధికారులు అక్రమ నిర్మాణాలకు కేవలం నోటీసులు ఇవ్వడమే కాకుండా బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ లేకుండా నిర్మించిన నిర్మాణాలను కూల్చి వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. 

WhatsApp Image 2025-09-08 at 2.21.04 PM

 

PUBLISHED BY : SHIVA KUMAR BS, 8686861338

 

Views: 135

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Error on ReusableComponentWidget

Latest News

ఎల్లమ్మబండ..అక్రమ నిర్మాణాలకు అడ్డా.! ఎల్లమ్మబండ..అక్రమ నిర్మాణాలకు అడ్డా.!
70-80 గజల్లో వెలుస్తున్న 6 అంతుస్తుల భవనాలు  జిహెచ్ఎంసి చట్టం 1955  ఇక్కడ వర్తించదా అంటూ స్థానికులు ఫైర్  పరోక్షంగా నిర్మాణాలకు సహకారం అందిస్తున్న అధికారులు అక్రమ...
అరెకటిక కార్పొరేషన్ ఛైర్మనుగా హనుమంతకారి హరికృష్ణ 
బంచరాయితండాలో ఘనంగా తీజ్ వేడుకలు.
లయన్స్ క్లబ్ మఖ్తల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ..
శ్రీయుత గౌరవనీయులైన కాంగ్రెస్ పార్టి జిల్లా అధ్యక్షులు నారాయణపేట గార్కి.
 ఇసుక లారీలను రోడ్లమీద  నిలుపవద్దు - సిపిఎం జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ
జైపాల్ రెడ్డికి 15 వేలు ఆర్థిక సాయం