అక్రమ నిర్మాణాలను తొలగించాలి
సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ డిమాండ్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ బ్లాక్ నెంబర్ 21,22 వెనక వున్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 233/15 లో వున్న స్థలం కబ్జా చేసి నిర్మించిన రెండు విల్లల అక్రమ నిర్మాణాల పై సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లోని ప్రజావానిలో పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బాచుపల్లి మండల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ -3 బ్లాక్ నెంబర్ 21,22 వెనక వున్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 233/15 ను కబ్జా చేసి సర్వే నెంబర్ - 274 లో పత్రాలతో పర్మిషన్ను తీసుకొని అక్రమ నిర్మాణలను చేపడుతున్నారు.
అని అన్నారు. నిజాంపేట్లో ప్రవేటు స్థలం పత్రాలు చూపెడుతూ ప్రభుత్వ స్థలలను కబ్జా చేయడం సర్వ సాధారణంగా మారింది అని అన్నారు. బాచుపల్లి తహసీల్దార్ ఫుల్ సింగ్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ భాను చందర్కి మున్సిపల్ కమిషనర్ షబ్బీర్ అలీకి, టౌన్ ప్లానింగ్ సరితకి అనేక సార్లు పిర్యాదు చేయడం జరిగిందని అన్నారు.
అని అన్నారు.అటి కబ్జా దారులకు స్థానిక అధికారులే సహకరిస్తున్నారు అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అని అన్నారు. కనుక వెంటనే పై కబ్జా, అక్రమ నిర్మాణాలు తొలిగించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రెవిన్యూ, మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాము అని హేచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశి.యాదయ్య, పీ.దాస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.
About The Author
Advertise

