పట్నంలో పాలమూరు బిడ్డలు సంఘం సభ్యత్వ నమోదు పోస్టర్ ఆవిష్కరణ
పాలమూరు వలస కార్మికులకు అండగా ఉండాలి: మంత్రి జూపల్లి
On
హైదరాబాద్: హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతంలో నివసిస్తున్న పాలమూరు వలస కార్మికులు, ఉద్యోగులకు పూర్తి అండగా నిలవాలని ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. పట్నంలో పాలమూరు బిడ్డలు సంక్షేమ సంఘం తయారు చేసిన సభ్యత్వ నమోదు పోస్టర్, వాహన స్టిక్కర్‌లను మంత్రి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్మికులకు కార్మికశాఖ ద్వారా గుర్తింపు కార్డులు, సంక్షేమ పథకాలు చేరేలా సంఘం పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎంఏ. కరీమ్, ప్రధాన కార్యదర్శి గోపాస్ రవీందర్, సభ్యులు బండి బంగారయ్య, శ్రీరాములు, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
22 Nov 2025 11:32:48
హైదరాబాద్: హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతంలో నివసిస్తున్న పాలమూరు వలస కార్మికులు, ఉద్యోగులకు పూర్తి అండగా నిలవాలని ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు....

