క్రమశిక్షణకు మారుపేరు ఎన్సిసి...
On
పాపన్నపేట, నవంబర్ 23. (నమస్తే భారత్ ప్రతినిధి)యువతలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించడంలో ఎన్సిసి ప్రముఖ పాత్ర పోషిస్తుందని పాపన్నపేట ఎన్సిసి అధికారి శ్రవణ్ కుమార్ వెల్లడించారు, ఆదివారం మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఎన్సీసీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సిసి క్యాడేట్లతో మార్చ్ ఫాస్ట్, తో పాటు ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ 20 లక్షల మంది క్యాండెట్లతో ఎన్సిసి ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫామ్ సమస్త గా ఎదిగిందని వెల్లడించారు, 1948లో అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలో ఎన్సిసి యూనిట్ ప్రారంభించి, ఈ సమావేశానికి అధ్యక్షత వహించినందున ప్రతి నవంబర్ నెల చివరి ఆదివారం ఎన్సిసి డే జరుపుకుంటున్నట్లు ఆయన వివరించారు.
Tags
Related Posts
Latest News
24 Nov 2025 18:00:56
తుగ్గలి24(నమస్తే భారత్): తుగ్గలి మండలంలోని ఏ గ్రామంలో అయినా సొంత ఇల్లు లేని వారు ఈనెల నవంబర్/30 వ తేదీ లోపల మీ సచివాలయంలోని ఇంజనీరింగ్
