బాలల నేస్తం.చాచా నెహ్రూ.తెలుగు ఉపన్యాసకులు,సామాజిక వేత్త బిజ్వార్ మహేష్ గౌడ్  

On
బాలల నేస్తం.చాచా నెహ్రూ.తెలుగు ఉపన్యాసకులు,సామాజిక వేత్త బిజ్వార్ మహేష్ గౌడ్  

 

ఉట్కూర్ మండలం / నమస్తే భారత్ 


 నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి జాతి సంపదలు,బాలల నేస్తం చాచా నెహ్రూ అని తెలుగు ఉపన్యాసకులు బిజ్వార్ మహేష్ గౌడ్ అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని జక్లేర్ న్యూ శాంతినికేతన్ పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలుగు ఉపన్యాసకులు,సామాజికవేత్త మహేష్ గౌడ్ మాట్లాడుతూ విరిసి విరియని కుసుమాలతోనే సరైన విద్యతో పాటు మెరుగైన సమాజాన్ని నిర్వహించవచ్చని,సుసంపన్నమైన దేశం కోసం సిద్ధమవుతున్న నేటి ఆణిముత్యాలు రేపటి మన జాతి రత్నాలు అని,తల్లిదండ్రుల కలల ప్రతిరూపాలు భావి భారత పౌరులని వారికి విద్యతో పాటు మంచి విలువలను నేర్పుదామని,పాలబుగ్గల నవ్వులు అపురూపమైన క్షణాలు..మరుపురాని జ్ఞాపకాలు బాల్యం ఒక వరమని,పిల్లలు భగవంతుని స్వరూపులని కళ్ళకపటo ఎరుగని కరుణామయులని,రివ్వున ఎగిరే గువ్వలని బాలల దినోత్సవ సందర్భంగా ఆయన అన్నారు.నవంబర్ 14 వచ్చిందoటే బాలలకు బోలెడంత సందడి తెస్తుందని ఈరోజు అంటే పిల్లలకు పండగ లాంటిదని,బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలాగా జరుపుకుంటారని పేర్కొన్నారు.నెహ్రూకు పిల్లలన్నా,గులాబీలన్న అమితమైన ప్రేమని,పిల్లలకు కూడా నెహ్రు అంటే వల్లమాలిన ప్రేమని ఆయన్ని ముద్దుగా చాచా నెహ్రూ,'చాచాజీ' అని పిలుస్తారని అందుకే నవంబర్ 14 న నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటామని ఆయన బర్త్ డేను చిల్డ్రన్స్ డే గా నిర్వహించడం ఆనవాయితీగా జరుపుకుంటున్నామన్నారు.ఈరోజున ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం ఉంటుందని పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, ఇతర కానుకలు పంచి పెడతారని,సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లల్లో ఉత్సాహం నింపుతారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ భీoరెడ్డి, సిద్రాo,రాధిక,ప్రభావతి,అరుణ, లక్ష్మీ,నర్మద తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise