"ఆపద్బాంధవుడు" ఎస్సై గండ్రాతి సతీష్
- ఎవరికి హనీ చేయని మహనీయుడు
- మానవత్వం, సేవాస్ఫూర్తి కలయికగా నిలిచిన పోలీస్ అధికారి
- పర్యావరణ పరిరక్షణకు అహర్నిశం కృషి
- యువతకు క్రీడల ద్వారా మార్గదర్శి
- రహదారుల గుంతలు పూడ్చిన మానవతా పోలీసులు
- ప్రజల భద్రతే ప్రథమ ధర్మం
- అనాధలకు అండగా. సేవలో మానవత్వం
- ఆపద్బాంధవుడికి మండల ప్రజల హర్షం
నమస్తే భారత్:- కురవి
నిజాయితీ, క్రమశిక్షణ, మానవత్వం ఈ మూడు విలువలతో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన అధికారి ఎవరైనా ఉన్నారంటే, ఆయన కురవి ఎస్సై గండ్రాతి సతీష్. విధుల్లో కఠినతతోపాటు హృదయంలో కరుణ కలగలిసి, అనాద వృద్ధుల నుండి యువత వరకు అందరి జీవితాల్లో వెలుగునింపుతున్నారు.ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్‌గా పేరు తెచ్చుకున్న సతీష్.ప్రజలకు అండగా పేదలకు ఆదారంగా.ప్రజల సమస్యలను ప్రజల మధ్యే తెలుసుకునే స్వభావం, నిరుపేద కుటుంబాల పట్ల మమకారం ఆయనకు ప్రత్యేకతని తెచ్చింది. ఎవరికీ హాని చేయని స్వభావం, సేవాస్ఫూర్తి వల్ల ప్రజలు ఆయన్ని.ఆపద్బాంధవుడు.గా సంబోధిస్తున్నారు.పర్యావరణ పరిరక్షణకు అహర్నిశం కృషి.కురవి పోలీస్ స్టేషన్‌నే ఆదర్శంగా మార్చిన అధికారి. ప్రతి వారం సిబ్బందితో కలిసి శ్రమదానం, పరిశుభ్రత నిర్వహణ, చెత్తరహిత వాతావరణం కల్పిస్తున్నారు. సొంత ఖర్చుతో స్టేషన్ ప్రహరీ గోడ, వాహనాల పార్కింగ్ నిర్మాణం చేశారు. చెట్ల పెంపకం, పక్షుల గూళ్లు, పక్షులకోసం నీటి పాత్రలు ఏర్పాటు. మానవత్వానికి ఆయన చిహ్నం.
యువతకు క్రీడల ద్వారా మార్గదర్శి.
క్రీడలే శక్తి, క్రీడలే స్ఫూర్తి! నినాదంతో యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తూ, క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ క్రీడల ప్రాముఖ్యత వివరించారు. యువత తమ ప్రతిభను క్రీడల ద్వారా పెంపొందించుకోవాలి. తల్లిదండ్రులు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని అవగాహన చేస్తున్నారు.రహదారుల గుంతలు పూడ్చిన మానవతా పోలీసులు.ప్రజల భద్రతే ప్రథమ ధర్మం. మండల పరిధిలో ప్రమాదకరంగా మారిన రహదారుల గుంతలను తన సొంత ఖర్చుతో పూడ్చి మరమత్తులు చేశారు. ప్రజలకు మద్యం సేవించి వాహనాలు నడపవద్దు, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దు అంటూ అవగాహన కల్పించారు. ఈ చర్యకు స్థానికులు అభినందనలు వెల్లువెత్తించారు.అనాధలకు అండగా.సేవలో మానవత్వం.బలపాల గ్రామానికి చెందిన వృద్ధురాలు సైదమ్మ జీవితంలో వెలుగునింపిన సతీష్ మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణ. మహిళా సిబ్బందితో స్నానం చేయించి, కొత్త దుస్తులు వేయించి, భోజనం పెట్టించి, సురక్షిత ఆశ్రయం కల్పించారు. అదే విధంగా తట్టుపల్లి, అయ్యగారిపల్లి గ్రామాల్లో అదృశ్యమైన వృద్ధులను కుటుంబాలకు చేర్చారు. కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.
దాతృత్వం, సేవలో ముందుండే పోలీస్ అధికారి.దీపావళి వెలుగులు. అనాధ పిల్లలతో సతీష్ ఆనందం పంచుకున్నారు. మహబూబాబాద్ అనాధ ఆశ్రమంలో పిల్లలతో పండుగ జరుపుకుని, బట్టలు, ఆహారం అందజేశారు. తన 10 ఏళ్ల పోలీస్ సేవకు గుర్తుగా, అన్నం ఫౌండేషన్కి రూ.10,000 విరాళం అందజేశారు. ఇల్లు లేని వృద్ధులకు సహాయం, పిల్లలకు ఉత్సాహం, ప్రతి అడుగులో మానవత్వం ఆయన నిర్వచనం.
శభాష్ పోలీస్ అంటూ అభినందనలు
ఇంటి రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇనుప కంచె లో చిక్కుకుని ఓ అనాధ వృద్ధుడు నాలుగు రోజుల పాటు నరకయాతన అనుభవించాడు. చిక్కుకున్న విషయం ఎవరికీ తెలియక పోవడంతో ఆకలితో అల్లాడి పోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై గండ్రాతి సతీష్ తొర్రూరులో విధుల నిర్వహణలో భాగంగా వృద్ధుడిని ఇనుప కంచె నుంచి వేరు చేసి సపర్యలు చేసి సురక్షితంగా వృద్ధాశ్రమానికి తరలించి మానవత్వం చాటుకున్నాడు. స్థానికులు శబాష్ పోలీస్ అంటూ అభినందనలు తెలిపారు.సేవాస్ఫూర్తికి చిహ్నం ఎస్సై గండ్రాతి సతీష్.ప్రజల ప్రేమ, పోలీస్ శాఖ గౌరవం రెండింటినీ అందుకున్న నిజాయితీ అధికారి. తన సైలెంట్ సర్వీస్‌తో సతీష్ ఈరోజు ప్రేరణాత్మక పోలీస్ అధికారిగా పోలీస్ వ్యవస్థలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విధులు నిర్వర్తించడం ఒక్కటే కాదు. మానవత్వం చాటడం నిజమైన సేవ.ఆపద్బాంధవుడికి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
