హలో మాల చలో ఢిల్లీ సభ విజయవంతం చేయాలి
నమస్తే భారత్ :-తొర్రూరు
హలో మాల చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి ఆశోద భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం డివిజన్ కేంద్రంలో సభను విజయవంతం చేయాలని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆ సంఘం మండల అధ్యక్షుడు అనపర్తి నాగేష్ అధ్యక్షతన జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల మహేష్ తో కలిసి మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మతోన్మాద సంస్థల మనువాద, ఎజెండాకు పాలకులు తమకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకోవాలనే లక్ష్యంతో భారత రాజ్యాంగంపై వివిధ రూపాల్లో దాడి చేస్తున్నారని, రాజ్యాంగాన్ని సనాతనం పేరుతో మార్చాలని కుట్రలకు పాల్పడుతున్నారని,
భారత పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ జీవో నెంబర్ 99 జీవో నెంబర్ 20 రాజ్యాంగ వ్యతిరేకం తక్షణమే పురస్ సమీక్షించాలని,ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో అద్దంకి సైన్యం యువసేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గార ఉపేందర్,
మాల మహానాడు పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి ఎనమాల రాకేష్, తొర్రూరు పట్టణ అధ్యక్షులు గార అనిల్, నెల్లికుదురు మండల అధ్యక్షులు కారం ప్రశాంత్, అద్దంకి యువసేన మండల అధ్యక్షులు బానాల సంజీవ, గంపల శంకర్, బూర్గుల దస్తగిరి, లోకేష్, చంద్రశేఖర్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు, శ్రీకర్,చిట్టిబాబు
తదితరులు పాల్గొన్నారు.
