గ్రామ పంచాయతీ ఎన్నికలలో 100% గిరిజనులు ఉన్న పంచాయితీలను గిరిజనులకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నాం జాదవ్ రమేష్ నాయక్

On
గ్రామ పంచాయతీ ఎన్నికలలో 100% గిరిజనులు ఉన్న పంచాయితీలను గిరిజనులకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నాం జాదవ్ రమేష్ నాయక్

 

మా తండాలలో మా రాజ్యం నినాదాన్ని తుంగలో తొక్కుతున్న పార్టీలు జాదవ్ రమేష్ నాయక్

నమస్తే భారత్:-మరిపెడ


ఆదివారం  డోర్నకల్ నియోజకవర్గ స్థాయి లంబాడీల ఐక్య వేదిక సమావేశం నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త యాదవ్ రమేష్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది ఈ సందర్భంగా ఈ నెలలో మళ్లీ దశ తెలంగాణ తొలి అమరుడు భూక్య ప్రవీణ్ నాయక్ అలియాస్ భూక్య మంగ్యా నాయక్ 16 వ వర్ధంతిని కార్యక్రమాన్ని మరిపెడ లో నిర్వహించాలని తీర్మానించడం జరిగింది అలాగే లంబాడీల ఐక్య వేదిక స్థానిక సంస్థలపై అలుపెరుగని పోరాటాన్ని చేస్తూ మా తండాలలో మా రాజ్యం పేరిట తెచ్చుకున్న తండా పంచాయతీలలో కేవలం గిరిజన లంబాడీలకే రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉంది అనే విషయం మనందరికీ తెలిసినదే, ఈరోజు వెలువడిన స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 50 శాతం కంటే ఎక్కువ లంబాడీలు ఉన్న తండా పంచాయతీలను లంబాడీలకే కేటాయించాలని ఎక్కి వేదిక డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల జనాభాను 2024 ప్రాతిపదికన తీసుకుంటే కేవలం ఎస్సీల జనాభా ఎస్టీల జనాభా 2011 ప్రకారం తీసుకుని మాకు రావాల్సిన వాటాను మాకు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని మేము భావిస్తా ఉన్నాము ఇలా చేయడం వల్ల మరల చట్టపరమైన అవరోధాలు వచ్చే అవకాశం ఉంది కావున ఎస్సీలకు ఎస్టీలకు ఎలాగైతే బీసీలకు 2024 జనాభా లెక్కల ద్వారా రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు ఆ విధంగా ఎస్సీలకు ఎస్టీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని లంబాడీల ఐక్యవేదిక కోరుతా ఉంది అని లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ ప్రవీణ్ నాయక్ అలాగే మండల సమన్వయకర్త గూగుల్లో దేవేందర్ నాయక్ అలాగే మండల ఇన్చార్జి గూగుల్ దేవేందర్ నాయక్ అలాగే జిల్లా విద్యార్థి విభాగ సమన్వయకర్త గూగులోత్ బాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు

Tags

Share On Social Media

Latest News

తుగ్గలి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి తుగ్గలి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి
    తుగ్గలి24(నమస్తే భారత్): తుగ్గలి మండలంలోని ఏ గ్రామంలో అయినా సొంత ఇల్లు లేని వారు ఈనెల నవంబర్/30 వ తేదీ లోపల మీ సచివాలయంలోని ఇంజనీరింగ్
సత్య సాయిబాబా జయంతి శత జయంతి ఉత్సవాలు
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్:ఎస్పీ డాక్టర్ వినీత్
గ్రామ పంచాయతీ ఎన్నికలలో 100% గిరిజనులు ఉన్న పంచాయితీలను గిరిజనులకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నాం జాదవ్ రమేష్ నాయక్
హలో మాల చలో ఢిల్లీ సభ విజయవంతం చేయాలి
పెద్ద తుప్పర గ్రామానికి చెందిన సాయిబాబాకు గణిత శాస్త్రంలో  డాక్టరేట్ 
మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా అట్టహాసంగా ఇందిరమ్మ చీరల పంపిణీ

Advertise