పెద్ద తుప్పర గ్రామానికి చెందిన సాయిబాబాకు గణిత శాస్త్రంలో డాక్టరేట్
డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా
ప్రొఫెసర్ రవికాంత్ చే డాక్టరేట్ అందుకున్న సాయిబాబా
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
నమస్తే భారత్ , రాజేంద్రనగర్, నవంబర్ 23, మండల పరిధిలోని పెద్ద తుప్పర గ్రామానికి చెందిన దుద్యాల సాయిబాబాకు మాథెమాటిక్స్ లో డాక్టరేట్ అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి ఎన్ఐటి ద్వారా పి.హెచ్ డి కి ఎంపికై డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవాలో వర్సిటీలో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టర్ రవి రాగోజి పర్యవేక్షణలో థెర్మో కన్వెన్క్టి థె ర్మోలైన్ ఇన్స్టాబిలిటీ స్ ఇన్ ఏ జాఫరీ ఫ్లోయిడ్ సాటిలైటెడ్ మీడియం అండ్ నాన్ లినర్ అనాలసిస్ పై పరిశోధన చేసి ప్రొఫెసర్ రవికాంత్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. పిహెచ్డి డాక్టరేట్ అందుకున్న సాయిబాబా కు గ్రామస్తులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు . రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద తుప్పర గ్రామానికి చెందిన సాయిబాబా గ్రామం లో 1వ తరగతి నుంచి 10 వరకు చదివిన సాయిబాబా మొదటి నుంచి చదువులో ప్రతిభ కనపరిచేవారని,శంషాబాద్ లో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి అత్యధిక ప్రతిభ కనబరిచిన సాయిబాబా, ఉస్మానియా యూనివర్సిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, పిహెచ్డి డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ నేషనల్నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవాలో రీసెర్చ్ ప్రొఫెసర్ రవి రాగోజు పర్యవేక్షణలో రీసెర్చ్ చేసిన అయన ప్రొఫెసర్ రవికాంత్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. నా పీహెచ్డీ పర్యవేక్షణలో గైడ్ గా అన్ని విధాలుగా సహకరించిన ప్రొఫెసర్ డాక్టర్ రవి రాగోజు సార్ కు అదే విదంగా నా తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు, కళాశాల ఉపాధ్యాయులకు, నాకు అన్ని విధాలుగా సహకరించిన నా స్నేహితులకు బంధువులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
