మార్పే లక్ష్యంగా ఎన్ఎస్ఎస్ సేవలు

On
మార్పే లక్ష్యంగా ఎన్ఎస్ఎస్ సేవలు

 

పింగిలి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రమౌళి

నమస్తే భారత్ :-తొర్రూరు

జాతీయ సేవా పథకం కార్యకర్తలంతా సామాజిక సేవే పరమావధిగా పనిచేయాలని హనుమకొండ పింగిలి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి చంద్రమౌళి అన్నారు.తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1, యూనిట్–2 విభాగాల ఆధ్వర్యంలో మండలంలోని చెర్లపాలెం గ్రామంలో కొనసాగుతున్న ఏడు రోజుల ప్రత్యేక శిబిరం సోమవారం తో ముగిసింది. 
స్థానిక  ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రాములు అధ్యక్షతన నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వాల్యా నాయక్, డాక్టర్ సుజాత లతో  కలిసి  ప్రొఫెసర్ చంద్రమౌళి మాట్లాడారు.సామాజిక సేవతోనే పరిపూర్ణ పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) దోహదపడుతుందన్నారు. సమాజ మార్పు కోసం విద్యార్థులు కృషి చేయాలని కోరారు. విద్యతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా.పాల్గొనడం.ఆహ్వానించదగిందన్నారు. విద్యార్థి దశ నుంచే సేవాభావం అలవర్చుకోవాలని కోరారు.వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి పోచయ్య మాట్లాడుతూ.జాతీయ సేవా పథకం విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి దోహదపడుతుందని,  ప్రత్యేక క్యాంపుల ద్వారా విద్యార్థులు అనేక సామాజిక అంశాలు నేర్చుకుంటారని తెలిపారు.అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, రిటైర్డ్ హెచ్ఎంలు ఏ. కృష్ణారెడ్డి, ఏ. రంగారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శాంతి కుమార్ , ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ రవీంద్రారెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్. సునీల్,  పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం తనూజ, యాకూబ్ అలీ, విద్యార్థులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి.
    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ
వికె కోల్ మైయిన్స్ కొత్తగూడెం ఏరియా కు కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు ను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తగూడెం ఏరియా INTUC వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ 
మెరుగైన వైద్య సేవల కోసం ఆధునీకరణ చర్యలు అవసరం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. 
పర్మిషన్ లేకుండా గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత: మరికల్ ఎస్సై రాము
విద్యాభివృద్ధికి పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్‌ కలామ్‌
పిడియస్ రైస్ పట్టివేత: మరికల్ ఎస్సై రాము
ప్రభుత్వ జాగా..ఓ లక్షాధికారి కబ్జా..!

Advertise