మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా అట్టహాసంగా ఇందిరమ్మ చీరల పంపిణీ

On
మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా అట్టహాసంగా ఇందిరమ్మ చీరల పంపిణీ


మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

పాపన్నపేట,నవంబర్ 23: (నమస్తే భారత్ ప్రతినిధి)


మహిళాభివృద్ధికి  పెద్దపీట  వేసిన ప్రజా  ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతున్నామని మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు.ఆదివారం రోజు పాపన్నపేట మండల కేంద్రంలోని,మెదక్ మండలం పాతూరులో, రామాయణపేటలో సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక చేయూతనిస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని. మహిళా సంఘాలు నిర్ణయించిన మోడల్ చీరలను పంపిణీకి ఎంపిక చేశామని తెలిపారు.
మహిళల ఆత్మగౌరవమే తమకు ప్రధానమని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు.గ్రామ, మండల సమాఖ్య బాధ్యులు చీరల పంపిణీ బాధ్యతను తీసుకొని ప్రతి మహిళకూ చీరలు అందేలా చూడాలని అన్నారు  మహిళలు ఐక్యంగా ఉండాలనే సందేశంతో చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు.మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీని బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు, క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటు, బస్సుల కొనుగోలు వంటి వ్యాపారంలో మహిళా సంఘాలకు ప్రభుత్వం తోడ్పాటునిస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూస్తోందని అన్నారు. రైతులు పండించిన వరిని బోనస్ ఇచ్చి మరి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయకుండా ఇక్కడే బియ్యం చేసి పౌరసరఫరాల శాఖ చౌక ధర దుకాణాల ద్వారా నిరుపేదలకు ఒకరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, ఈ ఘనత ప్రజా ప్రభుత్వాని కే దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise