వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేత
నమస్తే భారత్ :-తొర్రూరు
లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ సూర్నం రామ నరసయ్య అధ్యక్షతన వరద బాధితులకు 3వ సారి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
వరంగల్ మహానగరంలోని శాయంపేట ప్రణయ్ భాస్కర్ కాలనీలో భారీ వర్షాల బాధ్యత 40 కుటుంబాలలోని పేద మహిళలకు ఒక్కొక్కరికి 1500 రూపాయల విలువగల 10 కేజీల రైస్ బ్యాగ్స్, నిత్యవసర సరుకులు చింతపండు, ఉప్పు ,కారం,పసుపు, మసాలాలు పప్పులు మొదలగు తినే సామాన్లు మరియు దుప్పట్లు మొత్తం రూ.60 వేల రూపాయల విలువ గల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా 18 మంది మహిళలకు చీరలను,20 మంది పురుషులకు,పిల్లలకు టీ షర్ట్ లను అందజేశారు.ఈ కార్యక్రమంలో జీఎస్టీ కోఆర్డినేటర్ రేవూరి రమణ రెడ్డి, కాకతీయ రీజియన్ చైర్మన్ దుస్స శివశంకర్,వీరభద్ర రీజియన్ చైర్మన్ దామెర సరేష్, జోన్ చైర్మన్ చిదురాల నవీన్,క్లబ్ సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డి,వజినపల్లి శ్రీనివాస్, క్లబ్ జాయింట్ సెక్రెటరీ,బోనగిరి శంకర్,రాయల్స్ క్లబ్ ప్రెసిడెంట్ వలపదాస్ శ్యామ్ సుందర్, రాయల్స్ క్లబ్ సభ్యులు,రజనీకాంత్, కృష్ణకాంత్,తదితరులు పాల్గొన్నారు
