తప్పిన ప్రమాదం.. 90 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో పొగలు..
On
గద్వాల: గద్వాల జిల్లా మద్దూరు సమీపంలో ఆర్టీసీ బస్సుకు (RTC Bus) పెను ప్రమాదం తప్పింది. గద్వాల డిపోకు చెందిన బస్సు అయిజ నుంచి 90 మందికిపైగా ప్రయాణికులతో కర్నూలు వెళ్తున్నది. ఈ క్రమంలో మద్దూరు స్టేజీ వద్ద వెనక టైర్‌లోని బేరింగ్ నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. అద్దంలో పొగలను గమనించిన డ్రైవర్.. అప్రమత్తమై ప్రయాణికులను బస్సులో నుంచి దించేశారు. బస్సుకు మంటలు వ్యాపించకుండా నీటితో ఆర్పేశారు. అనంతరం ప్రయాణికులను ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు తరలించారు.
Tags
Related Posts
Latest News
13 Nov 2025 14:14:06
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో...
