ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్12:రంగారెడ్డి జిల్లా మండల కేంద్రంలలోని ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఉచిత నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గందె సురేష్ మాట్లాడుతూ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇంటర్మీడియట్ తొలి మెట్టు అని అన్నారు గవర్నమెంట్ కళాశాలలో చదివిన విద్యార్థులు కలెక్టర్లు ఇంజనీర్లు అయ్యారని గుర్తు చేశారు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 25000 నోట్ బుక్స్ గవర్నమెంట్ స్కూల్లో లో పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాధవరావు, ఫరూక్నగర్ మండల అధ్యక్షులు మరియు బుక్స్ కమిటీ చైర్మన్ ఎల్కుర్తి నారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు మిట్టపల్లి అంజయ్య, జిల్లా యువజన సంఘం కోశాధికారి మరియు సామాజిక కార్యకర్త నీల రవీందర్, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ మల్లిపెద్ది శ్రీనివాస్, ఫరూఖ్ నగర్ మండల మాజీ అధ్యక్షులు హన్మారి మురళి, గజవాడ యశ్వంత్ రాజ్ , శివ కరుణాకర్, తలకొండపల్లి ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు పి అరవింద్, గ్రామ అధ్యక్షులు కండే మధుసూదన్, సెక్రటరీ బిళ్ళ కంటి లక్ష్మణ్, కళాశాల అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ షణ్ముఖ రెడ్డి, కళాశాల అధ్యాపకులు కృష్ణ కాంత్, రనిషా, శ్రీనివాస్, పద్మ, యాదయ్య, గార్గేయ,సంతోష్, పరమేష్, వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.
