వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
అమరావతి : ఏపీలో మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ( పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించడంతో పాటు పోలీసులను బెదిరించడం, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ రాజనారాయణ, మరికొందరు అనుచరులతో కలసి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి , అడ్డుకున్న పోలీసులను నెట్టివేయడంపై పోలీసులు ఆగ్రహంతో ఉన్నారు .
అనుమతులు లేవని చెప్పిన డీఎస్పీ అరవింద్, సీఐ వెంకటేశ్వర్లుతో వాగ్వాదానికి దిగారని పోలీసులు ఆరోపించారు.దీంతో వైసీపీ నాయకులపై 126(2), 351(3), 126(2), 132, 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నిన్న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ఆందోళనలునిర్వహించారు.
