నూరేళ్ల ముగింపు వేడుకను ఉత్సాహ జరుపుకుందాం.
ఖమ్మం కేంద్రంగా సిపిఐ శత వసంతాల భారీ బహిరంగ సభ.
40 దేశాల నుండి తరలిరానున్న ప్రతినిధులు.
ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ.
విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంత్ రావు.
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ పాల్వంచ నవంబర్ 12_): ఖమ్మం కేంద్రంగా డిసెంబర్ 26న జరిగే సిపిఐ శత వసంతాల ఉత్సవ ముగింపు సభను ఉత్సాహభరితంగా జరుపుకుందామని, ఇందుకోసం కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు పిలుపునిచ్చారు. పాల్వంచ పట్టణ పరిధిలోని విగలాంగుల కొలను లోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మున్నా లక్ష్మీ కుమారి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ, మండల, పట్టణల కార్యదర్శుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ భారత దేశ స్వతంత్రాని కంటే ముందే కాన్పూర్ లో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) దేశ స్వతంత్ర సంగ్రామంలో తనదైన పాత్ర పోషించిందన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశానికి విముక్తి కలిగించేందుకు ఎందరో కమ్యూనిస్టు యువకిశోరాలు తన ప్రాణాలను పణంగా పెట్టారని చెప్పారు. ఆనాటి నుండి నేటి వరకు పేదలు బడుగు బలహీన వర్గాలకు ఎర్రజెండా అండగా ఉందని. భారత గడ్డపై నూరేళ్లు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉన్న ఈ పార్టీ మరో వందేళ్లు కూడా మనగలదు అనడానికి ఎలాంటి సందేహం లేదని, ప్రజా క్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటాలు చేసే పార్టీలను ఎన్నేళ్లవరకైనా ప్రజలు ఆదరిస్తారని, అందుకు సిపిఐ ఏ నిదర్శనం అన్నారు. ఖమ్మం కేంద్రంగా జరిగే శతవసంతాల ముగింపు సభకు 40 దేశాల నుండి ప్రతినిధులు తరలిరానున్నారని, కవులు మేధావులు కళాకారులు ఈ వేడుకలో పాల్పంచుకుంటున్నారని చెప్పారు. ఈ జిల్లా నుండి 3000 మంది రెడ్ షర్ట్ వాలంటీర్లును కవాతు కోసం సిద్ధం చేస్తున్నాము అని, అందుకోసం జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాలలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తలిపారు. వేలాది మందితో నిర్వహించనున ఎర్ర కవాతుతో ఖమ్మం పట్టణం మరింత అరుణ వర్ణంగా మారనుందన్నారు.
అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా మాట్లాడుతూ వందేళ్ల ముగింపు సందర్భంగా సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగనుందని చెప్పారు. కమ్యూనిస్టులకు కాలం చెల్లిందంటూ అవాకులు చెవాకులు పేలిన వారికి ఈ వేడుక చెంప పెట్టు కానుందాన్నారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా జీపుజాతాలు ప్రారంభంకానున్నాయని, సిపిఐ చరిత్ర, పోరాటాలను ప్రతి ఒక్కరికి తెలిపే విధంగా ఇంటింటి ప్రచారం, నిధి సమీకరణ సాగుతుందని తెలిపారు. ఈ ముగింపు సభ దేశ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచే విధంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి లక్షలాదిగా ప్రజలను కదిలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు k సారయ్య, సర్ రెడ్డి పుల్లారెడ్డి, రేసు ఎల్లయ్య చంద్రగిరి శ్రీనివాసరావు సాలిగంటి శ్రీనివాస్, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, వాసిరెడ్డి మురళి, ఉప్పుశెట్టి రాహుల్, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, భూక్య దాసురు, కమటం వెంకటేశ్వర్లు దేవరకొండ శంకర్ బంధం నాగయ్య మువ్వ వెంకటేశ్వర్లు తాతాజీ, మండల, పట్టణ కార్యదర్శులు ప్రజాసంఘాల జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.
