32 వాహనాల్లో పేలుడు పదార్ధాలు నింపేందుకు ప్లాన్
On
న్యూఢిల్లీ: ఎర్రకోట కారు పేలుడు(Red Fort Blast) ఘటన తర్వాత దర్యాప్తు ఏజెన్సీలు కొత్త విషయాన్ని పేర్కొన్నాయి. వైట్‌కాలర్ ఉగ్రవాదులు భారీ కుట్ర ప్లాన్ వేసినట్లు గుర్తించారు. పేలుడు పదార్ధాలతో ప్యాక్ చేసిన 32 వాహనాలను ఉగ్రవాదులు సిద్ధం చేసేందుకు ప్లాన్ వేసినట్లు దర్యాప్తు అధికారులు పసికట్టారు. పలు నగరాల్లో ఆ వాహనాలను దాడుల కోసం వాడాలని భావించారు. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన కారు పేలుడు ఘటనలో 13 మంది మృతిచెందారు. ఐ20, ఎకోస్పోర్ట్ కార్లను తమ ప్లాన్‌లో భాగంగా మాడిఫై చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సీరియల్ పేలుళ్లకు పాల్పడాలన్న ఉద్దేశంతో మరిన్ని వాహనాలను పేలుడు పదార్ధాలతో నింపేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
Tags
Related Posts
Latest News
13 Nov 2025 14:14:06
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో...
