ఏరియా లో గల సర్ఫేస్ ఖాళీలను నింపడంలో అలసత్వం వ్యవహరిస్తున్న కొత్తగూడెం ఏరియా మేనేజ్మెంట్: హెచ్ఎంఎస్
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 12_) హెచ్ఎంఎస్ యూనియన్ నాయకుల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గడిపల్లి కృష్ణ ప్రసాద్ గారు ఏరియా సమస్యల గురించి మాట్లాడుతూ సత్తుపల్లి లో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న కొంతమంది కార్మికుల డిప్యూటేషన్ రద్దుచేసి తిరిగి పివికే 5 మైన్ కి పంపే ఆలోచన లో భాగంగా కేవలం ఎల్ హెచ్ డి నడపడానికి ఆర్థరైజేషన్ ఉంది అన్న కారణంగా పనిగట్టుకుని మరీ కొంత మంది నీ టార్గెట్ చేస్తున్నారు అనే వార్త ప్రచారం జరుగుతుందని ఒక పద్ధతి ప్రకారంగా కాకుండా డిప్యూటేషన్ లో ఉన్న కార్మికులలో వీరిని మాత్రమే పిలవడం వెనక అంతరార్థం ఏమిటని ఒకవేళ ఇలాంటి చర్యలు చేపడితే సహించేది లేదని సంవత్సరాల తరబడి అక్కడ చేస్తున్న కార్మికులకు అక్కడే ఉద్యోగం నిర్వహించే అవకాశం కల్పించాలని హెచ్ఎంఎస్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం
టెక్నీషియన్ లకు పారదర్శకత లేని సర్ఫేస్ కౌన్సిలింగ్ నిర్వహించడం వల్ల కార్మికుల్లో వ్యతిరేకత రావడంతో దానిని సరిచేసి ఫీల్ అప్ చేయాల్సిన అధికారులు ఎవరో నాయకులు ఒప్పుకోవట్లేదట వారు ఒప్పుకుంటే చేస్తాం అని మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉంది ఇకనైనా ఇలాంటి చర్యలు బందు పెట్టి వెంటనే ఆరోజు ఇచ్చిన సర్కులర్ ప్రకారం గా ఆఫీస్ ఆర్డర్లను ఇష్యూ చేయాలని హెచ్ఎంఎస్ యూనియన్ గా డిమాండ్ చేయడం జరుగుతుంది
ఇకపోతే డిప్యూటేషన్లు విషయానికొస్తే డిప్యూటేషన్ దందా కు చరమగీతం పడాల్సిన మేనేజ్మెంట్ పైరవీ కారులకు వత్తాసు పలుకుతూ డిప్యూటేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంది సర్ఫేస్ ఖాళీలను ఫిలప్ చేయకుండా డిప్యూటేషన్ లకు వంత పాడడం ఏంటి అని ఇకనైనా డిప్యుటేషన్ దందాను బందు చేసి పర్మినెంట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి సర్ఫేస్ పోస్టులను ఫిల్ అప్ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది
ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారి అధ్యక్షతన బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆర్ సి హెచ్ పి పిట్ సెక్రెటరీ పూర్ణచందర్ హెచ్ఎంఎస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ సత్తుపల్లి సమంత పిట్ సెక్రెటరీ నరసింహారావు పి వి కే ఫై అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ నవీన్ నాయకులు కన్వీనర్ గౌస్, సాయి సందీప్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ హమీద్ ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.
