డబ్ల్యూపిఎస్  &  జి‌ఏ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్    (డబ్ల్యూపిఎస్ & జి ఎ) ఆధ్వర్యంలో రీజినల్ క్రికెట్ పోటీలు 

On
డబ్ల్యూపిఎస్  &  జి‌ఏ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్    (డబ్ల్యూపిఎస్ & జి ఎ) ఆధ్వర్యంలో రీజినల్ క్రికెట్ పోటీలు 


 
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 12_) కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు గారి ఆదేశానుసారం కొత్తగూడెం ఏరియాలో డబల్యూ‌పి‌ఎస్ & జి‌ఏ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (WPS&GA) ఆధ్వర్యంలో తేదీ.11.11.2025 (మంగళవారం)న రీజినల్ క్రికెట్ పోటీను ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్ రుద్రంపూర్, కొత్తగూడెం నందు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు గారు హాజరయ్యారు.
 
జిఎం గారు మాట్లాడుతూ, క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలని, కొత్తగూడెం ఏరియాకి కంపెనీ లెవెల్, కోల్ ఇండియాలో పాల్గొన్ని అధిక సంఖ్యలో బహుమతులు గెలచి, కొత్తగూడెం ఏరియా ప్రతిభ చూపాలని క్రీడలో పాల్గొనుటకు వచ్చిన క్రీడాకారులకు తెలియజేశారు, క్రికెట్ క్రీడా వ్యక్తిగత ప్రదర్శనతో ఆధారపడి ఉండదని, సమిష్టి కృషితో ఏ జట్టు అయితే ఉత్తమ ప్రదర్శన ఇస్తుందో ఆ జట్టు మాత్రమే వారు ఆడిన క్రీడా విజేతగా నిలుస్తారని ఇదే స్ఫూర్తితో మన సింగరేణిలో కూడా కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను సమిష్టి కృషితోనే సాధించగలమని  క్రీడల్లో పాల్గొనకు వచ్చిన ఉద్యోగులకు తెలియజేశారు.
 
అనంతరం జిఎం గారు, యూనియన్ ప్రతినిధులతో కలిసి క్రికెట్ క్రీడాకారులకు కరచలనంతో  అభివాదం చేస్తూ క్రీడాలలో పాల్గొనే వారికీ వక్తిగత స్వలాభలకు పోకుండా పాజిటివ్ ధోరణితో సమిష్టిగా ఆడాలని ఎటువంటి దెబ్బలు తగలకుండా రక్షణతో ఆడాలని క్రీడాకారులకు తెలియజేశారు .
 
ఈ కార్యక్రమంలో  జిఎం గారితో పాటు కొత్తగూడెం ఏరియా ఎఐటియూసి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జె. గట్టయ్య, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎం‌డి.రజాక్, ఎస్ఓటు జిఎం జి.వి. కోటి రెడ్డి, డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, డివైపిఎం జి.హరీష్ (హానరరీ సెక్రటరీ), ఎం.సి. పోస్నెట్ అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైసర్ & ఆర్గనైజింగ్ సెక్రటరీ కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా స్పొర్ట్స్ కో- ఆర్డినేటర్  భూక్యా.భీముడు, జనరల్ కెప్టెన్ బి. వెంకటేశ్వర్లు, క్రికెట్ కెప్టెన్ సిహెచ్. సాగర్ మరియు క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులు ఇతర సభ్యులు  పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

ఉగ్రకుట్రకు అడ్డాగా 17వ నంబర్‌ భవనం.. ఉగ్రకుట్రకు అడ్డాగా 17వ నంబర్‌ భవనం..
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్‌ ఫలాహ్‌ వర్సిటీ  పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో...
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
32 వాహ‌నాల్లో పేలుడు ప‌దార్ధాలు నింపేందుకు ప్లాన్
తప్పిన ప్రమాదం.. 90 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో పొగలు..
బీఆర్ఎస్‌లో అల్లుడు ఉన్నాడని.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ
ఏరియా లో గల సర్ఫేస్ ఖాళీలను నింపడంలో అలసత్వం వ్యవహరిస్తున్న కొత్తగూడెం ఏరియా మేనేజ్మెంట్: హెచ్ఎంఎస్ 

Advertise