ప్రజల జీవనస్థితిగతులపై అవగాహన అవసరం
నమస్తే భారత్ :-తొర్రూరు
ప్రజల జీవన స్థితిగతులపై విద్యార్థులకు అవగాహన అవసరమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాములు అన్నారు.
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1, యూనిట్– 2ల ఆధ్వర్యంలో మండలంలోని చెర్లపాలెం గ్రామంలో కొనసాగుతున్న క్యాంపు 6వ రోజుకు చేరుకుంది.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వాల్యా నాయక్, డాక్టర్ సుజాతల పర్యవేక్షణలో ఆదివారం గ్రామంలో విద్యార్థులు ప్రజల జీవనస్థితిగతులపై సర్వే నిర్వహించారు. జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు, విద్యా, ఆరోగ్యం, వ్యవసాయ రంగం తదితర అంశాలపై ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అని, గ్రామీణుల జీవన విధానాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితులపై విద్యార్థి దశలోనే అవగాహన.పెంపొందించుకోవాలన్నారు.ప్రోగ్రాం ఆఫీసర్లు వాల్యా నాయక్ సుజాతలు మాట్లాడుతూ.
సామాజిక ఆర్థిక సర్వేలు విద్యార్థుల్లో పరిశోధనా స్పృహను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్థానికులు పాల్గొన్నారు.
