ఉగ్రకుట్రకు అడ్డాగా 17వ నంబర్‌ భవనం..

On
ఉగ్రకుట్రకు అడ్డాగా 17వ నంబర్‌ భవనం..

ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్‌ ఫలాహ్‌ వర్సిటీ  పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది. దర్యాప్తు అధికారులు వర్సిటీకి చేరుకొని ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు బయటపడ్డట్లు తెలుస్తోంది.మెడికల్‌ కాలేజీలోని బాయ్స్‌ హాస్టల్‌ ఉండే 17వ నంబర్‌ భవనం వీరి ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ భవనంలోని 13వ నంబర్‌ గది కీలకంగా మారింది. ముజమ్మిల్‌కి చెందిన ఈ గది వైట్‌ కాలర్‌ టెర్రర్‌ మాడ్యూల్‌ (white collar terror module)కు రహస్య సమావేశ కేంద్రంగా పనిచేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీ, సమీప రాష్ట్రాల్లో పేలుళ్లకు ఈ గది నుంచే కుట్ర చేసినట్లు తేలింది.యూనివర్సిటీ ల్యాబ్‌ నుంచి కొన్ని రసాయనాలను తీసుకురావాలని ఉమర్‌, ముజమ్మిల్‌ ప్లాన్‌ వేసినట్లుగా సమాచారం. ఈ గదిలో సోదాలు చేపట్టిన దర్యాప్తు అధికారులు కొన్ని కెమికల్స్‌తోపాటూ పెన్‌డ్రైవ్‌లు, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముజమ్మిల్‌ గదితో పాటు ఉమర్‌కు చెందిన 4వ నంబరు గది నుంచి మూడు డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక విషయాలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. డైరీల్లో భారీ ఉగ్ర ప్లాన్లను గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.

Tags

Share On Social Media

Related Posts

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise