నాడు పాడుబడ్డ భవనం …నేడు రోజుకి 3 పెద్దాపెరేషన్ చేసే పేదల ఆసుపత్రి
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చర్ల సేవలు అమోఘం
జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లంవెంకట్రావు, డి సి హెచ్ ఎస్, డా రవి బాబు ప్రత్యేక కృషి
నమస్తే భారత్: భద్రాచలం
3 సంవత్సరాక క్రితం పాడుబడ్డ భవనం లాగా ఉన్న చర్ల ఆసుపత్రి నేడు అన్ని వసతులతో నీరుపేద వారికి సంజీవనిలా మారింది. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సహకారం, డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవి బాబు ప్రత్యేక శ్రద్ధ, భద్రాచలం శాసన సభ్యులు డా తెల్లం వెంకటరావు సూచనలు వెరసి చర్ల ఆసుపత్రి పరిసర ప్రజలతో పాటు పక్కనున్న ఛతీస్ఘడ్ ప్రజల మన్ననలు సైతం పొందుతోంది. కేవలం ఒక సంవత్సర కాలంలో అంచలంచలుగా ఎదుగుతూ కేవలం ఎంబీబీఎస్, డెంటల్ డాక్టర్స్ తో నడిచిన ఆసుపత్రి నేడు నలుగురు స్పెషలిస్ట్ డాక్టర్స్ తో సేవలు అందిస్తోంది. మారుమూల ప్రాంత మైనా నేపథ్యం లో ప్రత్యేక శ్రద్ధ వహించినా జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ఆసుపత్రి కి కావాల్సిన స్పెషలిస్ట్ వైద్యులు, మౌలిక సదుపాయాలు, డయాలిసిస్ సేవలు, పోస్ట్ మార్టమ్ సేవలు, సానిటేషన్ సేవలు, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు, జనరేటర్ ఏర్పాటు కి జిల్లా మంత్రులు,స్థానిక శాసనసభ్యుల సమన్వయం తో ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాలతో స్థానికులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాడు డయాలిసిస్ కోసం, ప్రసూతి సేవలు,కుటుంబ నియంత్రణ సేవలు, పోస్ట్ మార్టెం సేవల కోసం భద్రాచలం వరకు అరవై కిలోమీటర్లు ప్రయాణించినా రోగులు నేడు స్థానికంగానే సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం పదహారు మంది డయాలిసిస్ రోగులు చికిత్స పొందుతున్నారు.
నేడు ఒక రోజే 3 పెద్దపరేషన్ లు జరిగాయి అంటేనే ఆసుపత్రి పట్ల ప్రజల నమ్మకం తెలుస్తుంది. ప్రసూతి వైద్యురాలు శ్రావణి,పిల్లల వైద్యుడు రవి కుమార్, మత్తు డాక్టర్ శివ రామ కృష్ణ ప్రసాద్, డాక్టర్ రామ్ ప్రసాద్ సమన్వయంతో ఆపరేషన్ కాగా రోగులు ఆపరేషన్ అనంతరం క్షేమంగా ఉన్నారు. పిల్లల వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉండడం, నిన్న రాత్రి వనవాసి హాస్టల్ విద్యార్థులకు తీవ్ర గొంతునొప్పి,జ్వరం తో వచ్చిన పిల్లలను రాత్రి పూట కూడా చికిత్స చేయడం తో ఆసుపత్రి సేవలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
10 కోట్ల తో నూతన ఆసుపత్రి భవన నిర్మాణం పనులు ప్రారంభమైన నేపథ్యం లో త్వరలోనే నూతన భవనంతో మరింత సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.
