కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి..... సిపిఎం
:- ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది వేల రూపాయలు మద్దతు ధరను అమలు చేయాలి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి
పత్తికొండ(నమస్తే భారత్):
కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని గురువారం మండల కేంద్రమైన పత్తికొండ పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుండి స్థానిక ఆర్డివో కార్యాలయం వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దస్తగిరి అధ్యక్షతన వహించగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కంది పంటకు మద్దతు ధర ఎనిమిది వేల రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్పి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు అమ్ముకోవడం జరుగుతుందని ఇప్పటికే పండించినటువంటి పంటకు టమోటా ఉల్లి పత్తి సబ్జా గిట్టుబాటు లేక రైతులు అప్పులు పాలయ్యారని కనీసం ప్రభుత్వం చెప్పినటువంటి 8 0000 రూపాయలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిటి వెంకటరత్నమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి కాశన్న, రైతు సంఘం మండల అధ్యక్షులు రాజుల కారప్ప,వ్యవసాయ కార్మిక సంఘం బూజులు,సికామని, డివైఎఫ్ఐ దుగ్గేన్న, మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు రంగస్వామి, ఆటో వర్కర్స్ నాయకులు శేఖర్, సంజీవ్, హమాలీ వర్కర్స్ నాయకులు ఉరుకుందు, నడిపి రంగన్న, ఆనంద్, బిల్డింగ్ వర్కర్స్ నాయకులు రంగనాథ తదితరులు పాల్గొన్నారు.
