దివ్యాంగులను అన్ని రంగాలలో ప్రోత్సహించాలి
ఎంపీడీఓ డాక్టర్ వనపర్తి అద్వైత
ఖానాపురం డిసెంబర్ 4 ( నమస్తే భారత్ ) :
రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగుల ఎదుగుదలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని ఖానాపురం ఎంపీడీఓ డాక్టర్ వనపర్తి అద్వైత అన్నారు.తెలంగాణ ప్రభుత్వము విద్యాశాఖ వారి అధ్యర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఖానాపురం ఎమ్మార్సీ నందు ఎంఈఓ శ్రీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ దివ్యాంగులను చులకన చూడకూడదన్నారు.
దివ్యాంగులను ప్రోత్సహించి ముందుకునడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు.
విద్యార్థినీ విద్యార్థులు చదువులో రాణించాలని, వికలాంగతత్వం చదువుకు అడ్డు కాకూడదన్నారు.
మీరందరూ తల్లిదండ్రులను గౌరవిస్తూ చదువులో ముందు వరుసలో ఉండాలన్నారు. ఖానాపురం ఎస్ ఐ రఘుపతి మాట్లాడుతూ దివ్యాంగులు మానసిక స్థైర్యంతో విద్య వైద్యరంగాలలో రాణించాలని అన్నారు
