పైడిపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత.. నిరసనకారులపై లాఠీచార్జి, గాల్లోకి కాల్పులు

On
పైడిపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత.. నిరసనకారులపై లాఠీచార్జి, గాల్లోకి కాల్పులు

జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 17-12-2025న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తైన అనంతరం, ఓటమి పాలైన ఓ అభ్యర్థి తన అనుచరులు, కొందరు గ్రామస్తులతో కలిసి పోలింగ్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

పోలింగ్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తూ బ్యాలెట్ బాక్సులను తరలించకుండా అడ్డుకున్న నిరసనకారులు, పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసన కొనసాగించారు. పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు పోలీసులు సుమారు రెండు గంటల పాటు నచ్చజెప్పినా వారు వినకుండా ప్రతిఘటించారు.

 

ఆందోళనకారులు పోలింగ్ సిబ్బంది, సామాగ్రిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి నిర్వహించారు. దీనికి ప్రతిగా నిరసనకారులు పోలీసు అధికారులపై, పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వడంతో నలుగురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. రెండు పోలీసు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

IMG-20251218-WA0034

పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బందిని పటిష్ట బందోబస్తు మధ్య సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.

ఈ ఘటనపై రిటర్నింగ్ అధికారి, పోలీసు అధికారుల ఫిర్యాదుల మేరకు, అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు సంబంధించి వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత వ్యక్తులపై రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

IMG-20251218-WA0035

ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ డి. రఘు చందర్ స్పష్టం చేశారు.

Publisher

Namasthe Bharat

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise