కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ - భారీగా పట్టుబడ్డ మధ్యం
260 మంది పోలీస్ సిబ్బందితో స్పెషల్ ఆపరేషన్
అక్రమంగా అమ్ముతున్న 50 లీటర్ల మధ్యం
నిల్వ ఉంచిన16 డొమెస్టిక్ సిలిండరులు సీజ్
సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు
ఇతర రాష్ట్రాల పౌరుల వివరాలను తీసుకున్న వైనం
జీడిమెట్ల : శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సిపి సైబరాబాద్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు బాలానగర్ జోన్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల రామిరెడ్డి నగర్ లో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించరు పోలీసులు.
ఈ యొక్క ఆపరేషన్లో ముగ్గురు ఎసిపిలు , పది మంది ఇన్స్పెక్టర్లు, 25 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, అలాగే మొత్తం 260 మంది పోలీస్ సిబ్బందితో ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఇందులో ఎస్ఓటి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీజీపీఎస్ ట్రాఫిక్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 13 ఇండ్లను సెర్చ్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.
సర్చ్ లో ఐదుగురు రౌడీషీటర్లు అలాగే ఇద్దరు పాత నేరస్థులను గుర్తించడంతో పటు ఇతర రాష్ట్రాల పౌరుల వివరాలు తీసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన16 డొమెస్టిక్ సిలిండర్ లను సీజ్ చేసారు. వీరు డొమెస్టిక్ సిలిండర్స్ లో నుంచి కమర్షియల్ గా మార్చి ఇల్లీగల్ గా అమ్ముతున్న వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. అలాగే 50 లీటర్ల వరకు మధ్యాన్ని సీజ్ చేసి రెండు బెల్ట్ షాపుల పై కేసు నమవుదుకు రంగం సిద్ధం చేసారు.
సెర్చ్ లో దాదాపు 150 వరకు వెహికల్స్ ని చెక్ చేసి సరైన పత్రాలు లేని వాటిపై సంబంధిత సెక్షన్ లపై కేసులు నమోదు చేసారు. ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సాధారణ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడంతో పాటు, భరోసా కల్పించి, నేరస్తులకి వారు తప్పు చేయాలంటే భయపడేలాగా ఒక సంకేతాన్ని ఇచ్చే ఉద్దేశం కొరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని పోలీస్ ఉన్నత అధికారులు మీడియా తో స్పష్టం చేసారు.
ఈ ఆపరేషన్ ఏసిపి బాలానగర్ పి.నరేష్ ఆధ్వర్యంలో జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆపరేషన్ నిర్వహించి ప్రజలకు చేరుతామని ఈ సందర్భంగా ఏసీపి తెలియజేయడం పేర్కొన్నారు.
About The Author
Advertise

