దూలపల్లి ZPHS పాఠశాలలో హిందీ దివస్.!
వివిధ పోటీల్లో ప్రతిభా కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించిన హెడ్ మాస్టర్
హిందీ భాషా ప్రాముఖ్యత, గొప్పతనాన్ని వివరించిన ఉపాధ్యాయులు
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండల కేంద్రంలోని దూలపల్లి విల్లేజి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ హిందీ దివస్ను సోమవారం ఘనంగా నిర్వహించారు. హిందీ దినోత్సవ నేపథ్యం, భాషా ప్రాముఖ్యత, భాషా నైపుణ్యత, గొప్పతనం గురించి వివరించారు స్కూల్ హెడ్ మాస్టర్ వేణు గోపాల్. ఈ సందర్భంగా ఆరు నుండి పదవ తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులు వివిధ సంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్నారు. అలాగే గాగ్గిల్లాపూర్ సెప్టెంబర్ 10, 11, 12 తేదీలలో ఎస్జిఎఫ్ జోనల్ స్థాయి గేమ్స్ లో పాల్గొన్న పాఠశాల విద్యార్థులు అండర్ 14, 17 విభాగంలో కబడ్డీ, కోకో లో మొదటి బహుమతి, వాలీబాల్ ఆటలో మొదటి రెండవ బహుమతి సాధించడంతో వారికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయిని గాయత్రి దేవి విద్యార్థులకు మంచిగా శిక్షణ ఇచ్చి ఎంతో కృషి చేశారని, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారందరినీ అభినందించరు. టీచర్స్ డే సందర్భంగా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కాబడిన ఎం.శైలజ ఎస్ఏ తెలుగును సన్మానించరు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు బ్రహ్మచారి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
About The Author
Advertise

