తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి
ఉట్కూర్ మండలం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని సామాజిక కార్యకర్త హెచ్.నర్సింహా ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు.కర్ణాటక , మహారాష్ట్ర లో నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ జిల్లాలో అధికారికంగా నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు.ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల ఆత్మకు శాంతి కలగాలంటే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.చాలా మంది తెలంగాణ విమోచన దినోత్సవం గురించి భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కొందరు విలీన దినం అని,మరికొందరు విద్రోహ దినం అని మరియు ఇంకొందరు విమోచన దినోత్సవం అని అంటున్నారు.ఒక్కసారి ఈ విషయాలపై విశ్లేషణ చేస్తే ఖచ్చితంగా విమోచన దినోత్సవం మే సరియైనది అని చెప్పక తప్పదు.ఎందుకనగా విలీనం అంటే ఎలాంటి పోరాటం చేయకుండా శాంతి,చర్చల ద్వారా నిజాం ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణ జిల్లాలను భారత దేశంలో కలిపితే విలీన దినోత్సవం అనవచ్చు కానీ నిజాం ప్రభుత్వం ఎన్నో పోరాటాలు,ఉద్యమాలు మరియు ఎంతో మంది తెలంగాణ అమరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భయపడి భారతదేశంలో అంతర్భాగం చేశారు.కావున ఇది విలీనం కాదు అని అనిపిస్తుంది.విద్రోహ దినం అని మరికొందరు అంటున్నారు.ఎందుకంటే నిజాం పాలన ముగిసిన తర్వాత పటేళ్లు, పట్వారీ లు పేద ప్రజలను చాలా రకాలుగా పీడించి వారి భూములను స్వాధీన పరుచుకున్నాయి కావున విద్రోహ దినం అని అంటున్నారు. ఇది కూడా సరి అయినది కాదు అని అనిపిస్తుంది,ఎందుకంటే మనం పోరాటం చేసి తెలంగాణ జిల్లాలను నిజాం వారి నుండి భారత దేశంలో భాగంగా చేసుకున్నాము. పటేళ్ల నుంచి, పట్వారీ నుండి కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి.చివరికి విమోచనం దినం.విమోచనం అంటే మన తెలంగాణ జిల్లాలను హైదరాబాద్ స్టేట్ లోని నిజాం పాలన నుంచి స్వాతంత్ర్య భారత దేశంలో కలపాలని,మేము భారతీయులం కావున ప్రత్యేక దేశం గా ఉండాలనుకోవడం లేదు అని కులాలకు,వర్గాలకు అతీతంగా పోరాటం చేసి నిజాం పాలన కు ముగింపు పలికి స్వాతంత్య భారతంలో స్వేచ్ఛగా భారతీయులందితో హాయిగా,ఆనందంగా జీవితం గడపాలని నిజాం పాలన కు వ్యతిరేకంగా పోరాటం చేసి సాధించుకున్నారు కావున విమోచన దినోత్సవం మే సరియైనది అని మేధావులు,విద్యావేత్తలు మరియు సామాజికవేత్తల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కావున తెలంగాణ ప్రభుత్వం యావత్తు ప్రజల ఆకాంక్ష మేరకు సెప్టెంబర్ 17 ను ప్రతి సంవత్సరం అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహించని విజ్ఞప్తి చేశారు.అదే విధంగా నిజాం తూటాలకు బలి అయిన తెలంగాణ వీరుల చరిత్రలను పాఠ్యాంశాలలో చేర్చి బోధించాలని కోరారు.తెలంగాణ తొలి మరియు మలి దశ ఉద్యమాలలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ అమర వీరులు కుటుంబాలను ఆదుకోవాలని తెలిపారు.తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.తెలంగాణ ఉద్యమ కారులను గుర్తించి స్వాతంత్ర్య సమరయోధుల మాదిరిగా సౌకర్యాలు కల్పించాలని కోరారు.
About The Author
Advertise

