ఎమ్మెల్యే కృష్ణ రావును కలిసిన గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు
సమస్యలను తీరుస్తానని హామీ
కుకట్పల్లి : గ్రీన్ హిల్స్ రోడ్డులో గల బహుల అంతస్తుల సముదాయలైన రెయిన్భో విష్టాస్ రాక్ గార్డెన్, మెరినా స్కై, రేయిన్భో విష్టా పేస్ 1 సంఘాలు సంయుక్తంగా శాసనసభ్యులు మాదవరం కృష్ణారావును కలిసి తమ ప్రదానసమస్య గ్రీన్ హిల్స్ రోడ్డు మీద పుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుచేయించ వలసినదిగా కోరడం జరిగినది. దాదాపు 15 వేల మంది నివసిస్తున్న ఈ సముదాయాల నుండి మరియు ఇందులో ఉపాదికోసం రోజు వచ్చే 3వేల పైచిలుకు మహిళలు నిత్యం వేల సంఖ్య లో రోడ్డు కు అటువైపు వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. రానున్న కాలంలో కొత్తగా రాబోయే సముదాయల ద్వారా వేల సంఖ్యలో నివాసాలు రాభోతున్న తరుణంలో పాదచారుల కు ప్రదాన సమస్య కు పుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుచేయించి రంగదాముని మార్గం నుండి మాధాపూర్ కు ప్లై ఓవర్ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేసి శాశ్వత పరిష్కారం చూపమని బండి మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో మూడు సముదాయాల సంఘాల సభ్యులు టి.సత్యనారాయణరెడ్డి, ఓంకార్ రెడ్డి, రామారావు, రామ్ తిలక్, సుమంత్ కుమార్ పాల్గొన్నారు. మాధవరం కృష్ణారావు సానుకూలంగా స్పందించి తక్షణం సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను అని తెలియజేశారు.
About The Author
Advertise

