నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి సుశీలా కర్కితో మాట్లాడిన ప్రధాని మోదీ
నేపాల్‌లో ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన విషాదకరమైన ప్రాణనష్టానికి సంతాపం తెలియజేసిన ప్రధాని
నేపాల్ ప్రజల పురోగతికి, శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు
భారతదేశం పూర్తి మద్దతు తెలిపిన మోడీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన మంత్రి సుశీలా కర్కితో టెలిఫోన్ ద్వారా సంభాషణ నిర్వహించారు. కార్కి నియామకంపై ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. భారత ప్రభుత్వం, ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేసారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన విషాదకరమైన ప్రాణనష్టానికి ప్రధాని హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం దగ్గరగా పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది అలాగే నేపాల్ ప్రజల పురోగతికి, శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి భారతదేశం నేపాల్ ప్రయత్నాలకు పూర్తి మద్దతును తెలియజేసింది. నేపాల్‌కు భారతదేశం దృఢంగా మద్దతు ఇచ్చినందుకు ప్రధాన మంత్రికి కార్కి కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే ప్రధాన మంత్రి కోరికకు ప్రతిస్పందించారు. రాబోయే నేపాల్ జాతీయ దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలిపారు మోడీ. నాయకులు పరస్పరం సంప్రదించుకోవడానికి అంగీకరించారు.
About The Author
Advertise

