బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు షురూ
ప్రతి ఏటా కూకట్పల్లిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించటం ఆనావాయితీగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా బతుకమ్మలను ఆడపడుచుల ఆటపాటల నడుమ ఘనంగా పూజించి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయటం అనే వేడుకలు కూకట్పల్లి తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల వారికి కన్నుల పండుగల దర్శనం ఇస్తాయి. ఇట్టి కార్యక్రమం యావత్తు రాష్ట్రంలోనే అమావాస్యకు ఒక్కరోజు ముందుగా 20.09.2025 తారీకున నుండి సాయంత్రం 5 గంటలకు నుండి కూకట్పల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద భారీగా బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ బతుకమ్మ ఆడిన తరువాత రోడ్డు ఆవతలి వైపున పి.ఎన్.యం. స్కూల్ నందు బతుకమ్మ ఆడి రంగాధాముని చెరువులో బతుకమ్మలు నిమజ్జనం చేస్తారు20 తారీకున మొదలుకొని 9 తొమ్మిది రోజులు పాటు ఘనంగా వేడుకలు జరుపుకొని 29.09.2025 సోమవారం సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.
సద్దుల బతుకమ్మ సంబరాలు :
29.09.2025 సోమవారం రోజున సద్దుల బతుకమ్మ సంబరాలను కూకట్పల్లి నియోజకవర్గం యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించటం జరుగుతుంది. రంగాధాముని చెరువు (ఐ.డి.ఎల్) కట్ట పై ప్రత్యేక ఏర్పాట్ల నడుమ వేలాది మంది హాజరై బతుకమ్మలను ఘనంగా ఆటపాటలతో పూజించి నిమజ్జనం చేస్తారు. ఆత్యంత వైభవోపేతంగా ఆకట్టుకొనేలా ఆలంకరించిన బతుకమ్మలకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులను కూడ యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు చేతుల మీదగా అందచేయటం జరుగుతుంది. బతుకమ్మ వేడుకలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నాట్య ప్రదర్శనలు వంటి ఆదనపు కార్యక్రమాలతో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
బతుకమ్మ వేడుకల ముఖ్య వివరాలు :
1. 20.09.2025 శనివారం బతుకమ్మ ప్రారంభం
2. 21.09.2025 ఆదివారం పెద్దల అమావాస్య
3. 27.09.2025 శనివారం అట్ల బతుకమ్మ
4. 28.09.2025 ఆలిగిన బతుకమ్మ (ఈ రోజు బతుకమ్మ ఉండదు)
5. 29.09.2025
6. 2.10.2025 గురువారం విజయదశమి కూకట్పల్లి రామాలయం దేవాలయంలో సాయంత్రం 5. 30 విజయదశమి వేడకలు
About The Author
Advertise

