అంగీకార్ 2025 ప్రచార పత్రికల ఆవిష్కరణ
పాలకొల్లు, సెప్టెంబర్ 17 : పాలకొల్లు మున్సిపల్ కార్యాలయం మొప్మా కార్యాలయంలో బుధవారం కమీషనర్ ఆధ్వర్యంలో "అంగీకార్" 2025 ప్రచార పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ బి. విజయసారథి మాట్లాడుతూ పీఎం ఏవై 2.0 పథకం ప్రారంభమై ఏడాది పూర్తి కావడంతో పీఎంఈవై ఆవాస్ దివాస్ ను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపార. సెప్టెంబర్ నెల నుండి అక్టోబర్31 వరకు అంగీకార్ కార్యక్రమం జరుగుతుందని. పీఎంఏవై 2.0 పథకం వివరాలను లబ్ధి దారులకు తెలియజేయడం, పీఎంఏవై . 2.0 పథకంలో స్వంత స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్ధించుచునే లబ్ధిదారులను కేంద్రం 1.50 లక్షలు, రూ. రాష్ట్ర ప్రభత్వం రూ. లక్ష కలిపి రూ.2.50 లక్షలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పీఎం సూర్య ఘర్ ముస్తి మలియోగ ఉచిత విద్యుత పథకం , కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఇతర పథకాలు లబ్ధిదారులకు అందుతుందన్నారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీపీవో వీరబ్రహ్మం, సీఎంమ్ రత్నాకర్, ఏఈ డి.రమేష్ సీవోఎస్ సునేత్ర, రాధి, వీరభద్రరావు, సూరిబాబు, RPలు, మున్సిపల్ సిబ్బంది, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
Advertise

