త్రిబుల్ ఆర్ రోడ్డుతో మా బ్రతుకులు ఆగం అయితున్నవి

సాగర్ హైవే పై రైతులు, నాయకులు బైటయించి నిరసన

On
త్రిబుల్ ఆర్ రోడ్డుతో మా బ్రతుకులు ఆగం అయితున్నవి

  • భారీ పోలీస్ బలగలా మధ్య రైతులను అరెస్ట్
  • పోలీస్ స్టేషనుకు తరలింపు

త్రిబుల్ ఆర్ రోడ్డు మాకు వద్దంటూ నూతన అలైన్మెంట్ ను మార్చాలని కోరుతూ బుధవారం మాడ్గుల మండలం అన్నె బోయినపల్లి గేటు వద్ద సాగర్ హైవేను దిగ్బందించేందుకు రైతులు, అఖిలపక్ష నాయకులు యత్నించగా ఇబ్రహీంపట్నం ఏసిపి రాజు ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మోహరించి ర్యాలీగా వస్తున్న రైతులను, అఖిలపక్ష నాయకులను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను అడ్డుకున్నారు. దీంతో రైతులు ఒక్కసారిగా ఆక్రోషంతో ముఖ్యమంత్రి డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ మా భూములు లాక్కోవద్దంటూ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడం వల్ల మండల రైతులం తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు రైతులకు తోపులాట జరిగింది.

IMG-20250918-WA0067

పోలీసుల భారీ గేట్లను దాటి సాగర్ హైవే రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా దీంతో హైవేపై అర్థగంటసేపు వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ను మార్చి రైతుల నోట్లో మట్టి కొట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడా నాయకుల భూములను కాపాడి నిరుపేదల భూములను లాక్కునేలా హెచ్ఎండిఏ అలైన్మెంట్ విడుదల చేయడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు.

IMG-20250918-WA0068

రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసి పేదలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను మాజీ ఎమ్మెల్యే ను బలవంతంగా లాక్కు వెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ధర్నాలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏమి రెడ్డి జైపాల్ రెడ్డి, లక్ష్మీ నరసింహ్మా రెడ్డి, రెడ్డి కృష్ణారెడ్డి, జంగయ్య గౌడ్, తిరుమల్ రెడ్డి, రాజ వర్ధన్ రెడ్డి, సంజీవరెడ్డి, రమేష్ రెడ్డి, గ్యార చంటిబాబు, గౌనిలాలయ గౌడ్, కోరుకోరు తిరుపతయ్య, యాదిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆమనగంటి రామిరెడ్డి, నార కట్ల వెంకటయ్య, చంద్రయ్య గౌడ్, సిపిఎం నాయకులు కానుగుల వెంకటయ్య, మస్కు అంజయ్య, శివశంకర్, కుందూరు జగన్ పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

About The Author

Advertise

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ...
దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
ప్రాణాలు కాపాడండి సారు ! 
ఊరెళ్తున్నారా..జరభద్రం
ప్రమాదాల నుండి రక్షించండి

Advertise