బతుకమ్మ పండగకు ఏర్పాట్లలకు ఆదేశం
మహిళలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న మాధవరం కృష్ణారావు
భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే పూలతో బతుకమ్మను చేసి గౌరమ్మను పూజించే సంప్రదాయం వందల సంవత్సరాలుగా కొనసాగుతోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
శుక్రవారం ఉదయం రంగధాముని చెరువు (ఐ.డి.ఎల్ లేక్) బతుకమ్మ పనులు పరిశీలించి బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సంబంధిత అధికారులతో కలిసి బతకమ్మ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., కూకట్పల్లిలో అమావాస్య ముందు రోజు నుంచే బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. గతంలో బతుకమ్మలను మురికి నీటిలో వేసేవారని బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా మంచినీటితో కోనేరులు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు మహిళకు చీరలు పంపిణీ చేసేవాళ్లం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి చీరలు ఇవ్వడం మానేశారు అని విమర్శించారు.
తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మను అందరూ కలిసి ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఐడిఎల్ చెరువు, బొయిని చెరువు ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పండుగ రోజున విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. కోనేరుల్లో మంచి నీటిని నింపాలని, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కార్యక్రమల మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావు , వెంకటేష్, ప్రభాకర్ గౌడ్, మరియు సంబందిత అధికారులు పాల్గొన్నారు
About The Author
Advertise

Related Posts
