మహిళ ఆరోగ్యమే కుటుంబ,సమాజ ఆరోగ్యం
నారాయణపేట్ జిల్లా : మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, ఆ తర్వాత సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం నారాయణపేట మండలం అప్పక్ పల్లి గ్రామ శివారులో గల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి లో జాతీయ కార్యక్రమమైన "స్వస్థ్ నారి శశక్త్ పరివార్ అభియాన్" కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా నారాయణపేట శాసనసభ్యురాలు డాక్టర్ పర్ణికా రెడ్డి , స్థానిక సంస్థల జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయకుమార్ హాజరై ఉచిత "మెగా హెల్త్ క్యాంప్" ను ప్రారంభించారు.
ఈ మెగా హెల్త్ క్యాంపు లో మహిళలు మరియు చిన్న పిల్లలను ఎక్కువ భాగస్వామ్యం చేయాలని ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఒక కుటుంబం శక్తివంతంగా ఉంటుంది అనే ప్రధాన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని శాసనసభ్యురాలు డాక్టర్. పర్ణిక రెడ్డి,అదనపు జిల్లా కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. జయచంద్ర మోహన్ తమ ప్రసంగంలో తెలిపారు. ఈ క్యాంపులో స్పెషలైజేషన్ డాక్టర్లను ప్రతి మండల కేంద్రాలలో మరియు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో ప్రతిరోజు (17.09.2025 నుండి 02.10.2025 వరకు) 12 రోజుల వరకు వివిధ కేంద్రాలలో క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అత్యధిక సంఖ్యలో మహిళలు,పిల్లలు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివ రెడ్డి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. కే. జయచంద్ర మోహన్, మెడికల్ కాలేజీ విద్యార్థులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
Advertise

