కోటి దీపోత్సవం సందర్భముగా శ్రీ వెంకటేశ్వరా స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది .

On
కోటి దీపోత్సవం సందర్భముగా శ్రీ వెంకటేశ్వరా స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది .

00043f64-531c-4ef1-994c-a494e19c09ff

హిందూ ధర్మం చాల గొప్పది కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్16:షాద్ నగర్‌లో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం మరియు కోటి దీపోత్సవం ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా జరిగింది. వేలాదిగా భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకొని, దీపాలను వెలిగించి ప్రాంగణాన్ని కాంతులతో నింపారు.ఈ కార్యక్రమంలో ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్  ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని దాడులు జరిగినా హిందూ ధర్మము భక్తిని, సంస్కృతిని, కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నిలబెట్టింది. ధర్మరక్షణ ప్రతి హిందువు బాధ్యత. సామూహిక ఉత్సవంలో పాల్గొనడం ద్వారా సమాజానికి శక్తి వస్తుంది. ఆధ్యాత్మికత, భక్తి మార్గంలో అందరం ముందుకు సాగాలి” అని తెలిపారు.
కార్యక్రమంలో ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్  ఆధ్యాత్మికంగా, ప్రేరణాత్మకంగా ఉపన్యాసం చేసి భక్తుల హృదయాలను హత్తుకున్నారు. ఆయన ప్రసంగం ఈ దీపోత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.వంశీ కృష్ణ, బర్మాలి జంగయ్య దంపతులు స్వామి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించారు. వేద పండితుడు మహేష్ శర్మ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులు ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నరేందర్, మహేందర్ రెడ్డి, మలచం మురళి, శ్రీనివాస్ చారి, ఛత్రపతి శివాజీ ఆధ్యాత్మిక మండలి అధ్యక్షుడు నివాస్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కార్తీక దీపోత్సవంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొని దీపాలను వెలిగించడంతో షాద్ నగర్‌లో భక్తి, సంస్కృతి, ఐక్యత మరింత వెలుగొందాయి. ఈ వేడుక భక్తి జ్వాలలను ప్రతి ఒక్కరి హృదయంలో నింపిందని నిర్వాహకులు తెలిపారు.

Tags

Share On Social Media

Latest News

Advertise