సమరశీల పోరాటాలకు వేదిక సిఐటియు

On
సమరశీల పోరాటాలకు వేదిక సిఐటియు


 
రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి

నవంబర్ 28,29 తేదీల్లో సిఐటియు జిల్లా మహాసభ

జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్

నమస్తే భారత్ :-మరిపెడ

సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రంలో సమరశీల పోరాటాలు నిర్వహించడం ద్వారా అనేక విజయాలు సాధించినట్లు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి అన్నారు. ఆదివారం మహబూబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని స్థానిక కనకదుర్గ ఫంక్షన్ హాల్ లో సిఐటియు మండల విస్తృతస్థాయి సమావేశం కొండా ఉప్పలయ్య, కుమ్మరికుంట్ల జ్యోతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట ఉపేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల కష్టజీవుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం సిఐటియు అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి, భవన నిర్మాణ కార్మిక సంఘం, మున్సిపాలిటీ అండ్ గ్రామపంచాయతీ కార్మికులు, వీఆర్ఏ, ఫీల్డ్ అసిస్టెంట్, కారోబర్లు, ఆశా వర్కర్లు, హమాలి కార్మికులు, ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘల, కార్మిక కర్షక ఉద్యోగ సంఘాల పక్షాన నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వారి హక్కులను కాల రాస్తున్నారని వారు ఆరోపించారు. ఇన్నేళ్ల కాలంలో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఒక్క పారిశ్రామిక రంగాన్ని ప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించిన పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక హక్కుల కోసం నిలబడవలసిన ప్రభుత్వాలు వారికున్న హక్కులను తొలగిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో రైతు, కార్మికులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను అమలులోకి తీసుకొచ్చి కార్మికులకు పని గంటలు పెంచి కార్మిక వేతనాలను కుదించిందని కార్మికులను హరి గోస పెడుతున్నారని ఆరోపించారు. ఇటీవల కాలంలో జరిగిన దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. 

-మరిపెడలో28,29 తేదీల్లో సిఐటియు జిల్లా మహాసభలు

సమస్యల పోరాటాల వేదిక సిఐటియు మహబూబాద్ జిల్లా నాలుగవ మహాసభలు మరిపెడ పట్టణ కేంద్రంలోని నవంబరు 28న స్థానిక కనకదుర్గ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్టు జిల్లా 
ప్రధాన కార్యదర్శి కుంట ఉపేందర్ వెల్లడించారు. ఈ మహాసభల కోసం జిల్లా కార్మిక వర్గంతో పాటు మరిపెడ మండలం, పట్టణ ప్రజలు వ్యాపారస్తులు కార్మిక కర్షక ఉద్యోగులు కార్మికులు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. 
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బెస్త సంపూర్ణ మండల కన్వీనర్ దుండి వీరన్న, మండల నాయకులు మల్సూర్, భిక్షం, ముత్తయ్య, వెంకన్న, వాసు, సైదులు, వెంకన్న, జాముర్తి, లీలాబాయి, కవిత తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise