బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన
వెలిజర్ల జెడ్ పి హెచ్ ఏస్ హై స్కూల్‌లో ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమం
ఐసీడీసీ సూపర్వైజర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్ 15:ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఐ సి డి సి సూపర్వైజర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో ‘బేటీ బచావో – బేటీ పడావో,’ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న కిశోర బాలికలకు అమ్మాయిల విద్యాభద్రత, హక్కులు, అభివృద్ధి, బాల్యవివాహాల నివారణపై అవగాహన కల్పించారు.
బాల్యవివాహాలు జరగకుండా ఉండటం ప్రతి పౌరుడి బాధ్యతని, ఒకవేళ బాల్యవివాహం గురించి తెలిసినా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కు సంప్రదించాలని విద్యార్థులకు వివరించారు.అవగాహన కార్యక్రమంలో “బాల్యవివాహాలు నిషేధించండి బాల్యాన్ని రక్షించండి” నినాదంతో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అదనంగా సేవ్ గర్లు –సేవ్ నేషన్ అనే శీర్షికతో డ్రాయింగ్, వ్యాసరచన, మాట్లాడటం, పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా బాల్య వివాహాలు, శిశు విక్రయాలపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐసిడీఎస్ సూపర్వైజర్ జయలక్ష్మి మాట్లాడుతూ.. సమాజంలో బాల్యవివాహాలు, శిశు విక్రయాలు చట్ట విరుద్ధమని తెలిపారు. చదువుపై దృష్టి పెట్టినప్పుడే విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించగలరని సూచించారు. బాల్యవివాహాలను ప్రోత్సహించడం లేదా చేయడం చట్టరీత్యా నేరమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుఖేందర్ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ జయలక్ష్మి, సెక్రెటరీ యాదయ్య, డీసీపీయూ సిబ్బంది శ్రీలత, ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు ఉమా, సుజాత, నర్సమ్మ, సమంత, అలాగే తల్లులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
