జూబ్లీహిల్స్ విజయకేతనం... నవీన్ యాదవ్ గారికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం!
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అగ్రనేత రాహుల్ గాంధీ కలిసి వచ్చిన ఎమ్మెల్యేకు శంషాబాద్ కాంగ్రెస్ శ్రేణుల ఆత్మీయ అభినందనలు!
నమస్తే భరత్, నవంబర్ 16 శంషాబాద్
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించి, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని గెలుపును అందించిన యువ నాయకుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది.
ఉప ఎన్నికల విజయం అనంతరం నవీన్ యాదవ్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపి, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాహుల్ గాంధీ కలిసి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఈ స్వాగత కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ కౌన్సిలర్ అయిన పిల్లనగ్రోవిల సంజయ్ యాదవ్ ముందుండి వ్యవహరించారు. ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, తమ అభిమాన నేతకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి, జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించారు.
నవీన్ యాదవ్ చూసిన వెంటనే కార్యకర్తలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. సంజయ్ యాదవ్ ఎమ్మెల్యే ఆలింగనం చేసుకుని, ఉప ఎన్నికలలో సాధించిన చారిత్రక విజయాన్ని మరొకసారి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహమ్మద్ నజురుద్దీన్, మహమ్మద్ అజార్, అభిషేక్ యాదవ్, మనోహర్ యాదవ్, రాహుల్ తదితర ప్రముఖ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని, ఎమ్మెల్యే వెంట ప్రయాణమయ్యారు. యువ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పిల్లనగ్రోవిల సంజయ్ యాదవ్ నవీన్ యాదవ్ విజయం కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప ఉదాహరణ. జూబ్లీహిల్స్ ప్రజలు యువ నాయకత్వాన్ని, కాంగ్రెస్ సిద్ధాంతాన్ని బలంగా ఆశీర్వదించారు. రానున్న రోజుల్లో నవీన్ యాదవ్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాము," అని పేర్కొన్నారు.
నాయకులు మరియు కార్యకర్తల ఆప్యాయతకు, ఘన స్వాగతానికి నవీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తన మొదటి లక్ష్యమని, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
