ఏ ఐ యుగంలో కూడా కులహత్యలా?
ప్రేమిస్తే దళిత యువకులను చంపే రాక్షసత్వం… ఎప్పటి వరకు?”
రాజశేఖర్ హత్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ యువ నాయకుడు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్..
నమస్తే భరత్ షాద్ నగర్ నవంబర్16:దళిత యువకులు ప్రేమిస్తే చంపే రాక్షసత్వం ఇంకా ఈ కాలంలో కొనసాగడం తీవ్ర దుర్మార్గం ఏ ఐ యుగం వచ్చిందంటే మనసులు మారినట్టా? కులం పేరుతో ప్రాణాలు తీయడం మానవత్వానికి మచ్చ!” అంటూ బీజేపీ యువ నాయకుడు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ ఖండించారు.ప్రశాంత్ ముదిరాజ్ మాట్లాడుతూ దళితులంటే ఎందుకు ఈ చిన్నచూపు? ప్రేమించడం నేరమా? కుల అహంకారం వల్ల రాజశేఖర్‌ను దారుణంగా హత్య చేసి, శరీరాన్ని కాల్చివేయడం అమానుషం. ఇలా మనుషుల ప్రాణాల్ని బలిచేసే క్రూరత్వం సమాజంలో అసలు చోటు ఉండకూడదు. “ఈ కేసులో నిందితులపై చట్టం ప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలి. దళిత యువకుడిని హత్య చేసిన వారు ఎంత దారుణంగా ప్రవర్తించారో, అంతే కఠినంగా శిక్ష పడాలి. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలి.“ఇలాంటి సంఘటనలు మనం ఏ దిశగా వెళ్తున్నామో ఆలోచింపజేస్తున్నాయి. కులవివక్ష మన సమాజాన్ని ఎంత దెబ్బతీస్తుందో ప్రతి ఒక్కరు గ్రహించాలి. మనసులు మారితేనే సమాజం మారుతుంది. ఈ సంఘటనపై మేము దళిత సమాజంతో నిలబడి ఉన్నాము” అని పేర్కొన్నారు..
