పుస్తక పఠనమే జ్ఞానమునకు మూలం: చైర్మన్ సూరిబాబు
నమస్తే భారత్, పోడూరు, అక్టోబర్ - 16 : పుస్తక పఠనమే జ్ఞానమునకు మూలమని, బాల్యదశ నుండి పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని జిన్నూరు శ్రీ సీతారామరాజు విజ్ఞాన ప్రభా లైబ్రరీ, శాఖా గ్రంథాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ పెన్మెత్స సూర్యనారాయణరాజు (సూరిబాబు) అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ బూడి కృష్ణ రూ 6 వేల విలువ చేసే పుస్తకాలను గ్రంథాలయానికి విరాళంగా అందజేశారు. అనంతరం 56 మంది విద్యార్థులు క్విజ్ పోటీ నిర్వహించారు.
క్విజ్ మాస్టర్ గా రాయకుదురు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె. శ్రీనివాసరావు, భట్లమగుటూరు స్కూల్ హెడ్ మాస్టర్ నరసింహరాజు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ తాళాబత్తుల వెంకటేశ్వరరావు, పెన్మెత్స కాశీ విశ్వనాథ రాజు, ఆచంట సత్యనారాయణ మూర్తి, జిన్నూరు పంచాయితీ మాజీ ఉప సర్పంచ్ ఎలకల శ్రీనివాస్, లైబ్రరీ పాలకురాలు శ్రీమతి బత్తుల జోగారత్నం, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.
