కల్లుగీత  రాష్ట్ర మహా గర్జన సభ కు వేలాదిగా తరలిరండి :

On
కల్లుగీత  రాష్ట్ర మహా గర్జన సభ కు వేలాదిగా తరలిరండి :

 

 రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ

 విప్లవ పోరాటాలతోనే హక్కులు సాధ్యం - యువనాయకులు చిలువేరు.సమ్మిగౌడ్ 

నమస్తే భారత్:-కేసముద్రం

కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా నవంబర్ 28వ తేదీన సూర్యాపేటలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ ప్రకటించారు. ఈ మహాసభకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిమంది గీత కార్మికులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.హన్మకొండ జిల్లా రాంపూర్ గ్రామంలో జిల్లా అధ్యక్షులు గౌని సాంబయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా 2వ మహాసభలో పాల్గొన్న రమణ, జెండా ఆవిష్కరణ చేసి అనంతరం భారీ బైక్ ర్యాలీను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు —“బహిరంగ సభ అనంతరం నవంబర్ 29, 30 తేదీల్లో జరిగే ప్రతినిధుల మహాసభలో గీత కార్మికుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తాం” అని తెలిపారు.
1957లో ఏర్పాటైన కల్లుగీత కార్మిక సంఘం 68 ఏళ్ల పోరాటంలో సొసైటీలు, TFTలు, పెన్షన్, ఎక్సిగ్రేషియా వంటి హక్కులను సాధించుకున్నప్పటికీ ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న గీత వృత్తికి ప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.కేంద్ర బీజేపీ ప్రభుత్వం గీత కార్మికుల కోసం ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశపెట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఏదీ అమలు చేయలేదని రమణ ఆవేదన వ్యక్తం చేశారు.డిమాండ్లు:గీత కార్మికుల పెన్షన్‌ను ₹4,000కి పెంచాలి,ఎక్సిగ్రేషియాను ₹10 లక్షలకు పెంచాలి,ప్రతి కార్మికుడికి కాటమయ్య రక్షణ కవచం వెంటనే ఇవ్వాలి,పెండింగ్‌లో ఉన్న ఎక్సిగ్రేషియా వెంటనే విడుదల చేయాలి,నీరా, తాటి ఈత ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో గీత కార్మికుల సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. సూర్యాపేటలో జరిగే రాష్ట్ర సభకు జిల్లావారీగా కనీసం పది వేల మంది హాజరుకావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్టు ఛైర్మన్ తాళ్లపల్లి రామస్వామి గౌడ్, సామాజిక వేత్త,గోపా డివిజనల్ అధ్యక్షులు చిలివేరు సమ్మీ గౌడ్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేష్, రవి, జనగాని సాయి కుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise