దళిత యువకుడ్ని కులహంకార హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి బుద్ధుల జంగయ్య
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్16:దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ ను కులఅహంకార హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఈ షాద్ నగర్ ప్రాంతంలో కుల అహంకార పరువు హత్య ఇది మూడోదని ఆయన తెలియజేశారు గతంలో కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో ఇలాంటి హత్యనే జరిగిందని తర్వాత క్రమంలో చెవులపల్లి గ్రామంలో ఇలాంటి హత్య నే జరిగిందని యాదవులు అక్కడ దళిత యువకులను ప్రేమించి ఉన్నందుకుగాను కూతుళ్ళనే హత్యలు చేయడం జరిగిందని దళిత ప్రజా సంఘాలు అభ్యుదయ రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే అప్పుడు హత్యలు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు కట్టి జైలకు పంపించిన పరిస్థితి అని ఆయన తెలియజేశారు ఇక్కడ యాదవులు ప్రేమించిన వ్యక్తి సోదరున్నే ఎర్ర రాజశేఖర్ ను కొట్టి చంపి కాల్చి వేయడమనేది హేనమైన చర్య అని ఇలాంటివి కులహంకార పరువు హత్యలుగా పర్యనించాల్సి వస్తుందని ఇలాంటి దుర్మార్గాలకు వడి కట్టిన అంతకులను
చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు
ఇంత టెక్నాలజీ ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కూడా మనుధర్మ శాస్త్ర కుల విభజన గ్రామాలలో పట్టణాలలో నేటికీ రాజమేలుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలులో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాంటి దారుణాలకు వడిగడుతున్నారని ఇలాంటివి ఆగాలంటే రాజ్యాంగంలో ఉన్న చట్టాలను సక్రమంగా అమలు పరచాల్సిన అవసరం ఉందని మనుధర్మ శాస్త్రాన్ని పాటించి కుల హాంకారిగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు వెంటనే ఫరూక్ నగర్ మండలంఎల్లంపల్లి గ్రామాన్ని కలెక్టర్ పోలీస్ యంత్రాంగం సందర్శించి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన అని కూడా ఆయన డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అభ్యుదయ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సామాజిక సంఘాలు అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
