24 గంటల్లో హత్య కేసును చేదించిన కొత్తూరు పోలీసులు

On
24 గంటల్లో హత్య కేసును చేదించిన కొత్తూరు పోలీసులు

 

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్12:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో మంగళవారం జరిగిన టైల్స్ వర్కర్ ఎండి సంశూల్ (31) హత్య కేసును కొత్తూరు పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పోలీసుల కథనం ప్రకారం..పురపాలక పరిధిలో ఉన్న ఓ వెంచర్ లోని ఇంటి నిర్మాణంలో పనిచేసే సంశూల్ (బీహార్), ప్లాస్టరింగ్ వర్కర్ గంగా ప్రసాద్ కు (ఛత్తీసఘర్) పని విషయంలో గొడవలు, అలాగే తన భార్యపై సంశూల్ అనుమానంగా చూస్తున్నాడనే కక్షతో గంగా ప్రసాద్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 01:00 గంటలకు, మద్యం సేవించిన గంగా ప్రసాద్, కిచెన్ రూమ్లో పడుకొని ఉన్న సంశూల్ తలపై గనేట్ రాయితో బలంగా కొట్టి హత్య చేశాడు. హత్య తర్వాత బుధవారం పెంజర్ల రోడ్డులో అనుమానాస్పదంగా కనిపించగా, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. ఈ కేసును వేగంగా ఛేదించిన ఎస్.ఐ.లు గోపాల కృష్ణ, సత్య శీలా రెడ్డి, సిబ్బంది కుమార్, రవి కుమార్, మహిపాల్, హరీష్ కుమార్ లను 
సీఐ జీ. నర్సయ్య అభినందించారు.

Tags

Share On Social Media

Latest News

ఉగ్రకుట్రకు అడ్డాగా 17వ నంబర్‌ భవనం.. ఉగ్రకుట్రకు అడ్డాగా 17వ నంబర్‌ భవనం..
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్‌ ఫలాహ్‌ వర్సిటీ  పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో...
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
32 వాహ‌నాల్లో పేలుడు ప‌దార్ధాలు నింపేందుకు ప్లాన్
తప్పిన ప్రమాదం.. 90 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో పొగలు..
బీఆర్ఎస్‌లో అల్లుడు ఉన్నాడని.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ
ఏరియా లో గల సర్ఫేస్ ఖాళీలను నింపడంలో అలసత్వం వ్యవహరిస్తున్న కొత్తగూడెం ఏరియా మేనేజ్మెంట్: హెచ్ఎంఎస్ 

Advertise