బూర్గుల సుమన యాదిలో..
ప్రగతి రూరల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఘన నివాళులు..
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్09:ప్రముఖ సంఘ సేవకురాలు బూర్గుల సుమన స్ఫూర్తి సంస్మరణ సభ బూర్గుల గ్రామంలోని ప్రగతి రూరల్ డెవలప్మెంట్ సెంటర్లో నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుమన పూర్వ విద్యార్థి ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ అలోక్ అగర్వాల్ పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.. అలాగే సుమనమ్మ కుటుంబ సభ్యులు తమ్ముడు బూర్గుల ప్రదీప్ కుమార్, అంబిక, చిన్న చెల్లెలు అరుణమ్మ, డాక్టర్ అనుపమ, బూర్గుల రామకృష్ణారావు మనుమడు లక్ష్మీకాంతం, బూర్గుల వేణుగోపాల్ రావు దంపతులు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ప్రగతి వెల్ఫేర్ సొసైటీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలో సుమనమ్మ ప్రగతి వెల్ఫేర్ సొసైటీ తో కలిసి చేసిన కార్యక్రమాలను ఆధ్యాంతం ఉమ్మడి బూర్గుల గ్రామ ప్రజలు తిలకించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి సుమనమ్మకు అతి ఇష్టమైన నువ్వుల లడ్డు రాగి లడ్డు పల్లి పట్టి మునగాకు చెక్కలు మినుముల మురుకులు మరియు ఒక సేపు పండు వచ్చిన వారందరికీ ఇవ్వడం జరిగింది. అనంతరం డాక్టర్ అలోక్ అగర్వాల్ మాట్లాడుతూ నా గురువైన సుమన మేడం ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని అభివృద్ధి నా ప్రధాన ధ్యేయమని అందరూ సుఖ సంతోషాలతో జీవించడమే మా లక్ష్యం అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ శంకర్ రాథోడ్ విశ్రాంత హెచ్ఎం సురేష్ కుమార్ బూర్గుల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రీతి బాల ఉపాధ్యాయులు మరియు బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అంగన్వాడి టీచర్లు సామాజిక కార్యకర్తలు మరియు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
