జీవో 34 అమలు అయ్యేలా చూడాలి
కలెక్టర్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూక లెక్టర్కు వినతిపత్రం అందజేసిన ఎన్పి ఆర్డి
దివ్యాంగులకు ప్రత్యేక శాఖ కేటాయించాలి
ఎన్పి ఆర్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి జేర్కొని రాజు
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్10: వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మార్చాలని, జీవో 34 అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జేర్కొని రాజు అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి కి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 డిసెంబర్ 2న విడుదల చేసిన జీవో నెం.34 ప్రకారం వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా, శిశు సంక్షేమ శాఖ నుండి వేరు చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలనినిర్ణయించినప్పటికీ,ఇప్పటివరకు ఆ ఉత్తర్వులు అమల్లోకి రాకపోవడంపై వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వికలాంగుల సంక్షేమానికి సంబంధించిన జీవో 34ను వెంటనే అమలు చేయండి అని డిమాండ్ చేశారు.జీవో 34 ప్రకారం మహిళా, శిశు సంక్షేమ శాఖలో విలీనమై ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖను తిరిగి వేరు చేసి, ప్రతి జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్ (వికలాంగుల సంక్షేమం) పదవిని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా, శాఖ నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని సర్దుబాటు చేసి ప్రత్యేకంగా వికలాంగుల సేవా కేంద్రాల ద్వారా కార్యక్రమాలు అమలు చేయాలని కూడా ఆ జీవోలో పేర్కొంది.అయితే మూడు సంవత్సరాలు గడిచినా జీవో అమలు కావడం లేదని, దానివల్ల జిల్లాల స్థాయిలో వికలాంగుల సంక్షేమ కార్యక్రమాలు తీవ్రంగా నష్టపోతున్నాయని వేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం జీవో ఇచ్చి మూడు సంవత్సరాలు గడిచినా, దానిని అమలు చేయకపోవడం వికలాంగుల పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. ప్రతి జిల్లాలో ప్రత్యేక శాఖ ఉంటేనే సేవలు సమర్థవంతంగా అందుతాయి. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ కూడా ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేస్తూ...జీవో 34 అమలుతో ప్రతి జిల్లాలో వికలాంగుల సమస్యలు త్వరగాపరిష్కరించబడతాయి.ప్రత్యేక శాఖ ఏర్పాటుతో పింఛన్లు, ఉపాధి పథకాలు, పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా సాగుతాయి. ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకుండా జీవో అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది.వికలాంగుల హక్కుల చట్టం ఆర్ పి డబ్ల్యూ డి ఏ సి టి 2016) ప్రకారం ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక మానిటరింగ్ మెకానిజం ఉండాలి. జీవో 34 అమలవడం ఆ దిశగా ఒక ముందడుగు అవుతుంది. అందుకే ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని అమలులోకి తేవాలని తెలిపారు.ధర్నాలో వికలాంగుల సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ సంస్థల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
