వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కీసర తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

On
వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కీసర తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి

కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ లో
వికలాంగుల పెన్షన్ రూ 6,000/- పెంచాలని మరియు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు,నేత, గీత, బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు రూ 4,000/- పెంచాలని,కండరాల క్షీణత కలిగిన వారికి రూ. 15,000/- ఇవ్వాలని అలాగే దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కీసర మండల తహశీల్దార్ కార్యాలయం ముట్టడి చేసిన వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS), చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి (CPHPS), మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS). ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల అయిన కూడా ఇప్పటివరకు పెంచిన పించన్లు ఇవ్వాలని కీసర మండల తాసిల్దార్ కార్యాలయం ముట్టడి చేసి ధర్నా నిర్వహించారు.అనంతరం ఉప తహశీల్దార్ కి వినతిపత్రం అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు.వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే స్థానిక ఎన్నికలలో వికలాంగుల పోరాటం ఏంటో చూపిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆవుల అల్లాజీ, టైగర్ నరసింహ, శ్రీనివాస్ రెడ్డి, రాజు రెడ్డి, కృష్ణారెడ్డి, రమేష్ ,ముత్యం బాలస్వామి, దత్తు, చోటు మోహన్రావు ,భాగ్యమ్మ ,బిక్షపతి గౌడ్ ,విక్టోరి గైడెన్,కీసర మండల MRPS అధ్యక్షులు మంచాల మహేందర్ మాదిగ, మండల  ఇంచార్జ్ బుడిగె జగన్ మాదిగ, ఉపాధ్యక్షులు తుడుం శ్రీనివాస్ మాదిగ, శీలం మల్లేష్ మాదిగ, బందెల పరమేష్ మాదిగ, నల్ల చంద్రయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250916-WA0014

About The Author

Advertise

Error on ReusableComponentWidget

Latest News

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ...
దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
ప్రాణాలు కాపాడండి సారు ! 
ఊరెళ్తున్నారా..జరభద్రం
ప్రమాదాల నుండి రక్షించండి

Advertise