ముదిరాజ్ జెండా ఆవిష్కరణ   

On
ముదిరాజ్ జెండా ఆవిష్కరణ   

 

ప్రభుత్వం మత్స్యకారుల్ని ఆదుకోవాలి     
                   
 బత్యం లక్ష్మణ్ 

నమస్తే భారత్:-మరిపెడ

అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల్ని ఆదుకోవాలని వారన్నారు ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఎల్లంపేట గ్రామ సొసైటీ అధ్యక్షులు బత్యం లక్ష్మణ్ ముదిరాజ్ సంఘం జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక సంఖ్యలో ఉన్న బీసీలు బీసీలలో ఎక్కువ శాతం గున్న ముదిరాజులని ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని దానివలన మత్స్యకారులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగలేక వెనుకబడి పోతున్నారని వారన్నారు మత్స్యకారులకు న్యాయం చేకూర్చే విధంగా ప్రభుత్వాలు మత్స్యకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా మత్స్యకారులను ఆర్థికపరంగా ఎదిగేలాగా కార్యక్రమాలు చేపట్టాలని వారన్నారు ముదిరాజులనుబిసి డి నుండి బీసీ ఏ మార్చాలని వారి డిమాండ్ చేశారు అదేవిధంగా సబ్సిడీ చాప పిల్లల బదులు సొసైటీ ఖాతాలోకి అమౌంట్ రూపంగా జతపరచాలని వారు అన్నారు అట్లాగే ముదిరాజు కులస్తుల పిల్లలకు ప్రత్యేకంగా సంక్షేమ హాస్టల్లో ఏర్పాటు చేసి వాళ్ళు పై చదువులకు పోయేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారి ఈ సందర్భంగాకోరారు అలాగే చెరువుకుంటల పైన పూర్తి హక్కు మత్స్యకారులకు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చెరువు కుంటలు కబ్జాకు గురి.కాకుండా.చెరువులనుకాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే మత్స్యకారుల వృత్తికి సరిపడా పరికరాలను.వాహనాలనుమత్స్యకారులకు అందజేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా ఎల్లంపేట ముదిరాజ్ సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise