గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం
నమస్తే భారత్ :-తొర్రూరు
కంటయపాలెం గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మోకాటి సుజాత వెంకన్న అన్నారు.కంటయపాలెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా టిపిసిసి ఉపాధ్యక్షురాలు,కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి,పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలు మోకాటి సుజాత వెంకన్నను బలపరచడంతో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.తనను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా కష్టం వచ్చినా ఆదుకుంటానన్నారు. ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డిల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాలం ఉపేందర్,మందపురి కుమారస్వామి,ఎనగందుల శ్రీనివాస్, గోనే ప్రవీణ్,బానోత్ నరసింహ నాయక్,సాయిలు, ఇదునూరి యాకయ్య,మార్క వెంకన్న,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
